అంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం ఖాయమని దాదాపు ఖరారు అయిందని చాలా మంది చెప్పుకుంటున్నారు. టీడీపీ మాటలు చూస్తుంటే ఓటమి వారే ఒప్పుకున్నట్లు కనిపిస్తుందని తెలుస్తుంది. అయితే అయితే రాష్ట్రంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విశ్లేషణల మధ్యన ఈ అనంతపురం ఎంపీ అభ్యర్థి అప్పుడే జగన్ తో టచ్లోకి వెళ్లినట్టుగా సమాచారం. ఇతడు జగన్ తో సమవయస్కుడు. జగన్ కు ఫ్రెండ్ అనే టాక్ కూడా ఉంది.


రాజకీయంగా విబేధాలు గతం నుంచి ఉన్నా.. జగన్ తో ఇతడికి సాన్నిహిత్యం ఉందంటారు. ఆ విషయాన్ని కూడా ఇతడూ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు.ఇక తను ఎంపీగా గెలవడం ఖాయమనే ధీమాతో ఉన్న ఈ యువనేత  - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమనే అంచనాలతో అటు వైపు జంపింగ్ కు ఇప్పటికే రెడీ అయిపోయారట. ఫలితాలకు ముందే అక్కడ కర్చిఫ్ వేస్తే కాస్త విలువ పెరుగుతుందనే లెక్కతో జగన్  తో అపాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నాలు సాగించినట్టుగా సమాచారం.


అయితే ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ ఎంపీ క్యాండిడేట్ కు జగన్ అపాయింట్ మెంట్ దక్కుతుందని భోగట్టా.  అయితే ఇక్కడ జగన్ మరిన్ని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారట. అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ముందు.. సదరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో జగన్ ఈ అంశం మీద చర్చించనున్నట్టుగా సమాచారం. వారి అభిప్రాయాలను తీసుకుని.. వారిలో మెజారిటీ మంది అందుకు సమ్మతిస్తే సదరు యువనేతను పార్టీలోకి తీసుకోవాలని జగన్ అనుకుంటున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: