ఎన్నికల ఫలితాల అంచనాపై ఉత్కంఠ పెరుగుతున్న వేళ మరో కొత్త సర్వే వచ్చింది. న్యూ ఆంధ్రా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. కడప, నెల్లూరు  జిల్లాల్లో  ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం చూపింది. మొత్తం పది స్థానాలు ఉంటే.. ఒక్క రాజంపేట మినహా అన్ని స్థానాలు గెలుచుకుంది. 


న్యూ ఆంధ్రా సర్వే ఫలితాల్లో మళ్లీ కడప జిల్లాలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. ఈ జిల్లాలో కనీసం 9 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందట. ఒక్క స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుందట. అదీ వైసీపీ గెలిస్తే ఈ జిల్లాలో టీడీపీ బోణీ చేయనట్టే. 

ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 7, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి కూడా దాదాపు అదే ఫలితాలు రాబోతున్నాయి. వైసీపీ ఒక స్థానం పెంచుకుని 8 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. 

టీడీపీకి గత ఎన్నికల్లో మూడు స్థానాలు వస్తే.. ఈసారి మరో స్థానం తగ్గే అవకాశం ఉందట. నెల్లూరు జిల్లాలో వైసీపీ 8, తెలుగుదేశం 2 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందని న్యూ ఆంధ్రా సర్వే చెబుతోంది. రాష్ట్రమంతా ఓవరాల్ గా చూస్తే ఈ సర్వే ప్రకారం .. వైసీపీ 101 సీట్లు గెలుచుకుని అధికారం చేజిక్కించుకుంటోందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: