ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అందరు భావిస్తున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్‌లో తమకు బెర్త్ దక్కుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లానా వారికి కేబినేట్‌లో బెర్త్‌లు ద‌క్కాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రో వైపు జ‌గ‌న్ తో స‌న్నిహింతంగా ఉన్న నేత‌లు కూడా మంత్రి ప‌ద‌వుల‌కోసం త‌మ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.


మంత్రి ప‌ద‌వుల‌పై గంపెడు ఆశ‌లు పెట్టుకున్న నాయ‌కుల జ‌గ‌న్ షాక్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. వారెవ‌రికీ స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేద‌నె స‌మాచారం పార్టీ వ‌ర్గాల‌నుంచి వ‌స్తోంది.ఫలితాలు వచ్చిన తరువాతే దీనిపై చర్చిద్దామని నేతలకు ఆయన తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేబినేట్ కుర్పుపై ఏ ముఖ్య‌మంత్రి తీసుకోని కొత్త విధానాన్ని జ‌గ‌న్ తీసుకుంటున్న ట్లు తెలుస్తోంది.


ముఖ్యమంత్రిని కలుపుకుని మొత్తం 26 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సీఎం కాక 25 మందిని కేబినేట్‌లోకి తీసుకోవ‌చ్చు. అన్ని వ‌ర్గాల వారికి ప్రాధాన్య‌త క‌ల్పిస్తూ కేబినేట్‌ను ఎంపిక చేసుకోవ‌డం జ‌గన్‌కు కొంత క‌ష్ట‌మ‌య్యే ప‌నె. అందుకే ప్ర‌తి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గానికి ఒక‌రిని చొప్పున కేబినేట్‌లోకి తీసుకొనేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌యిన‌ట్లు స‌మాచారం. ఇదే నిర్ణ‌యాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఒక వేల జ‌గ‌న్ ఇదే పంథాను అనుస‌రిస్తే మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న పార్టీలోని చాలామంది సీనియర్ నేతలకు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: