వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కొన్నాళ్లుగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు.. అనుమానాలు నిజమే అయ్యాయి. ఈ విషయాన్ని ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ సర్కారే ఒప్పుకుంది.  వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ఎదుట ఏపీ రాష్ట్ర ప్ర భుత్వం అంగీకరించింది.


 టెలిగ్రాఫ్ చట్టం 1885లోని సెక్షన్ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముం దు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్  దుర్గాప్రసాద్‌లతో కూడి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. 

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తదుపరి విచారణ జూన్ ఆరోతేదీకి వాయిదా వేసింది. ఫోన్ల ట్యాపింగ్‌పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ  విచారణ సందర్భంగా కొన్ని వివరాల్ని తమకు అందజేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి తీసుకోడానికి రివ్యూ కమిటీ ఏర్పాటు చేశారా? ఇందుకు అనుమతి పత్రం సమర్పించారా? దీనికి కమిటీ అనుమతి ఇచ్చిందా? అధికారికంగా ట్యాప్‌ చేశారా? లేదా? అన్నది తెలియజేయాలని జస్టిస్ ఏపీ శేషసాయి, జస్టిస్ యు దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ను ప్రశ్నించింది. 

అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా సాగించిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు ముందు పెను ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఈ కేసును సులభంగా వదిలే అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: