రాబోయే ఫలితాల్లో తెలుగుదేశంపార్టీకి 130 సీట్లు వస్తాయన్న లెక్క కేవలం ఊహాత్మకమే అని తేలిపోయింది. చంద్రబాబునాయుడు స్వయంగా ఆ విషయాన్ని అంగీకరించటంతో టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ, పార్టీకి అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయన్న విశ్లేషణలన్నీ కేవలం ఊహాత్మకమే అని తేల్చేశారు.

 

వైసిపికి 120 సీట్లు వస్తాయని, అధికారంలోకి రావటం ఖాయమని వైసిపి నేతలు అంచనాలు వేస్తున్న విషయం తెలిసిందే. దానికితోడు సోషల్ మీడియాలో కూడా రాబోయే ప్రభుత్వం వైసిపిదే అనే ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. దాంతో టిడిపి నేతలు ఢీలా పడిపోయారు. అదే విషయాన్ని చంద్రబాబు మాట్లాడుతూ వైసిపి నేతలవి కేవలం ఊహాత్మకమే అని చెప్పటం అయ్యుంటుంది.

 

టిడిపికి ఓటమి ఖాయమని వైసిపి చెప్పటం కాదు. పోలింగ్ రోజు నుండి చంద్రబాబు మాట్లాడిన మాటలు, చేసిన గోలతో పార్టీ ఓటమి ఖాయమని టిడిపి నేతల్లో చాలామంది ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో వైసిపిలో ఫుల్లు జోష్ కనబడింది. దాంతో తమకు 120కి పైగా సీట్లు వస్తాయని అంచనాలు మొదలెట్టారు.

 

తన మాటల వల్ల  పార్టీకి  జరిగిన డ్యామేజీని ఆలస్యంగా గుర్తించిన చంద్రబాబు టిడిపికి 130 సీట్లు వస్తాయని ప్రకటించారు. నేతలు కూడా అదే లైన్లో మాట్లాడాలంటూ ఆదేశించారు. మళ్ళీ తాజాగా విశ్లేషణలన్నీ ఊహాగానాలే అని అన్నారు. అంటే టిడిపికి 130 సీట్లు వస్తాయన్నది కూడా ఊహాగానాలేనా అనే చర్చ టిడిపి నేతల్లో జోరందుకుంది.

 

రోజుకో ప్రకటనతో నేతలను చంద్రబాబు అయోమయానికి గురిచేస్తున్నారు.  కష్టాలు టిడిపికి కొత్త కాదట. మోడి చేసిన దుర్మార్గాలు జనాల సహనానికి పరీక్షంటూ చెప్పటంలో లాజిక్ ఎవరికీ అర్ధంకాలేదు. ప్రతీ ఎన్నికల్లో టిడిపికే 80 శాతం ఓటింగ్ రావాలని, యువత మొత్తం టిడిపివైపే ఉండాలని, కుల, మతాల ప్రకారం ఓట్లు చీలకూడదని చెప్పటం చంద్రన్నకే చెల్లింది.  ఓటర్లు కులాలు, మతాల వారీగా చీల్చటంలో చంద్రబాబే ఆధ్యుడు. అంటే చంద్రబాబు చేసేదొకటి, చెప్పేదొకటి అని మరోసారి అర్ధమైపోయింది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: