ఏపిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అధికార తెలుగు దేశం తీరుతో పరిస్థితులు అనిశ్చితంగా మారుతున్న సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారినట్లు తెలుస్తుంది. దీనికి అధికార పక్షం బాధ్యత వహించ వలసిన అవసరముంది. అలాగే ప్రతిపక్ష వైసిపి సునిశిత దృష్టి పెట్టి అధికార పక్ష కదలికలను గమనిస్తుంది.  
Image result for president rule in ap 2019
అయితే ఏపి గురించి మనమొకలా ఆలోచిస్తుంటే కేంద్రం నిఘా వర్గాల సమాచారం దరిమిలా మరోలా ఆలోచిస్తున్నట్లు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో 25 రోజు ల్లో ఫలితాలు వస్తాయనీ, అప్పటివరకూ టీడీపీ అధికారంలో ఉండి, ఆ తర్వాత ఫలితాలను బట్టీ, ఎవరు అధికారంలో ఉండేదీ తెలుస్తుందని మనం అనుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ 25 రోజులూ రాష్ట్రపతి పాలన తెచ్చే యోచనలో ఉందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
Image result for president rule in ap 2019
ప్రధానంగా ఉన్నతాధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందనీ, ఇది రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని అంటున్నారు న్యాయనిపుణులు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సైతం, టీటీడీ నగల విషయంలో లేవనెత్తుతున్న ప్రశ్నలు అధికార పక్షానికి సవాలుగా మారబోతున్నాయనీ, ఈ పరిణామాలు కేంద్రం జోక్యం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 25రోజులు సమయం ఉంటే, ఇప్పటికే ఈవీఎంల, వీవీప్యాట్లలో 50 శాతం స్లిప్పులను కౌంటింగ్ చెయ్యాలంటూ, అందుకు మద్దతు కోసం దేశమంతా ప్రచారం చేస్తూ తిరుగుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుకి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నూతన తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది.
Image result for war between cm chandrababu and Ys Jagan
ప్రస్తుతం ఏపీలో చాలా ప్రజా సమస్యలు నెలకొన్నాయి. ఎండలు పెరిగి తాగునీటి సమస్య ప్రజలకు భారంగా మారి అశాంతి ఎక్కువవుతోంది. అకాల వర్షాలు వెంటాడు తున్నాయి. శ్రీలంకలో పేలుళ్ల ప్రభావంతో ఏపీలో కూడా శాంతిభద్రతలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 

ఇదే సమయంలో ఉన్నతాధికారులు తమదైన సొంత ప్రకటనలు చేస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం తమపై నియంతృత్వ ధోరణితో వ్యవహ రిస్తోందని ఉన్నతాధికారులు ఆరోపిస్తుంటే, ఉద్యోగులు తమకు సహకరించట్లేదని ప్రభుత్వం మండి పడుతోంది.

టీటీడీ బంగారం వివాదం కూడా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తోంది. బంగారం తరలింపు వెనక టీడీపీ కుట్ర ఉందంటున్న ప్రతిపక్ష వైసీపీ, వారం రోజుల్లో ఆధారాలతో సహా నిరూపిస్తామని ప్రకటించింది. బంగారం విషయంలో టీటీడీ, ఏపి ప్రభుత్వం రెండూ తగిన జాగ్రత్తలు తీసుకోలేదనీ, తెరవెనక కుట్ర ఉన్నందువల్లే ఇలా చేశాయనీ వైసీపీ ఆరోపిస్తోంది. కావాలనే లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తూ, లబ్ది పొందేందుకు వైసీపీ యత్నిస్తోందని టీడీపీ తిరిగి సమాధానం చెపుతుంది. ఇలా అధికార ప్రతిపక్షాలు రెండు  సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
Image result for TTD Gold issue
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని గమనిస్తున్న కేంద్రం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని నిఘావర్గాలు కూడా హెచ్చరిస్తుండటం తో, కేంద్రం అలర్ట్ అవుతోంది. ముఖ్యంగా ఫలితాల ప్రకటన రోజున రాష్ట్రంలో ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించటం తో ముందు గానే రాష్ట్రపతి పాలన తెచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని తెలిసింది. ఫలితాలకు ముందే రాష్ట్రపతి పాలన తెస్తే, టీడీపీ పూర్తిస్థాయి (ఐదేళ్లు) అధికారంలో ఉన్నట్లు అవ్వదు. అది ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. 


ఐతే, రాష్ట్రపతి పాలన తెచ్చేంత దారుణ పరిస్థితులు లేవంటున్న టీడీపీ వర్గాలు అంతా వైసీపీ చేస్తున్న హైడ్రామా అని కొట్టిపారేస్తున్నాయి. ఫలితాల రోజున రాష్ట్రంలో శాంతి భద్రత లకు ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నాయి.

Image result for president rule in ap 2019

మరింత సమాచారం తెలుసుకోండి: