``విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా చంద్ర‌బాబును ఎన్నుకుంటే.. ఏపీకి గుండు కొట్టించారు`` - ఈ మాట అంటోంది ఆయ‌న‌కు నిన్నటి వ‌ర‌కు భ‌జ‌న చేసిన ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల నాయ‌కులే. ఇప్పుడు వ‌చ్చేనెల జీతాల‌కే ఖ‌జానాలో రూపాయి బిళ్ల లు ఏరుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. కేంద్రం నిధుల‌తో అభి వృద్ది చేశామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. చాప‌కింద నీరులాత‌న ప్ర‌చారానికి నిదులు కుమ్మ‌రించారు. ధ‌ర్మ పోరాట దీక్ష ల పేరుతో ఆయ‌న చేసిన హ‌డావుడి అంతా ఇంతాకాదు, ఇక‌, పోల‌వ‌రం, అమ‌రావ‌తి సంద‌ర్శ‌న పేరుతో కొన్ని వంద‌ల బ‌స్సుల‌ను వినియోగించారు. వ‌చ్చిన వారికి రోజు కూలీ కింద కొంత మొత్తం ప్ర‌తి ఒక్క‌రికీ చెల్లించారు. ఇది ఎన్నిక‌ల కోడ్ ముందు వ‌ర‌కు సాగిన దుబారా వ్య‌యం.


ఇక, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా ఆయ‌న ప్ర‌జాధ‌నాన్ని మంచి నీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన త‌న మిత్ర ప‌క్షాల‌కు ప్ర‌చారం చేస్తున్నా రు. దీనికి గాను త‌న వెంట ఓ ప‌దిమందిని కూడా తిప్పుకొంటున్నారు. దీనికి గాను ప్ర‌త్యేక విమానాల‌నే బుక్ చేసుకుంటు న్నారు. ఇక, ఆయా రాష్ట్రాల్లో పేరెన్నిక‌గ‌న్న హోట‌ళ్ల‌లో బ‌స చేస్తున్నారు. మ‌రి దీనికిగాను ల‌క్ష‌ల కొద్దీ రూపాయ‌ల‌ను ఆయ‌న ఖ‌ర్చు చేస్తున్న‌ట్టుతెలుస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల కోడ్ అమల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రజ‌ల సొమ్ముతో నిర్వ‌హించే ప్ర‌భుత్వ వాహ‌నాల‌ను కానీ, విమానాల‌ను కానీ వినియోగించ‌కూడ‌ద‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయి. 


కానీ, వాటిని ఏమాత్ర‌మూ ప‌ట్టించుకోకుండానే చంద్ర‌బాబు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యం లో జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల్సిన ఎన్నిక‌ల సంఘం అధికారులు కానీ, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానీ మ‌న‌కెందుకులే అని నిమ్మ‌కునీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాయా? అనే సందేహం వ్య‌క్తమ‌వుతోంది. ఇక‌, ఇప్ప‌టికే స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని చెప్ప‌డంతో ఇటు ఎన్నిక‌ల సంఘంపైనా, అటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంపైనా కూడా తీవ్ర‌స్తాయిలో ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో వీరెవ‌రూ కూడా చంద్ర‌బాబు చేస్తున్న ఈ దుబారా వ్య‌యంపై దృష్టి పెట్ట‌లేక పోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి అధికారంలో ఉన్న‌ప్పుడు, ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ ఉన్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబు ఇలా ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేస్తుంటే అడిగే నాధుడు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: