దీర్ఘకాలం విచారణలపై స్టేలు అమలవుతున్న కేసులపై సుప్రీం కోర్ట్ దీర్ఘ కాలం కేసులపై స్ట్రే కొనసాగించరాదన్న నిర్ణయం అమలు చేయటం మొదలైంది.  ఈ విధమైన విచారణ నిలుపుదల చేయబడ్డ కేసులు చంద్రబాబుకు చెందినవి పదిహేనుపైగా ఉన్నట్లు తెలుస్తుంది.
 Related image
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో తిరిగి విచారణ మొదలైంది. 2005 లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ జరపాలని నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టు ను ఆశ్రయించారు. అయితే లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌ పై చంద్ర బాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. కాగా దేశ వ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసు లో తెచ్చుకున్న స్టే రద్దయింది.


దీంతో హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు కేసు విచారణను మళ్లీ మొదలు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆమె శుక్రవారం (26.04.2019) కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై వచ్చేనెల 13న హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.

Image result for lakshmi parvati Vs chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: