అదేంటో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడడం తెలుగు తమ్ముళ్ళకు అలవాటు అయిపోయింది. ఓ వైపు అధినేత చంద్రబాబు ఈవీఎం ల మీద ప్రతీ రోజూ గుస్సా అవుతూంటే మరో వైపు తమ్ముళ్ళు కూడా బాస్ ని బాగానే ఫాలో అవుతున్నారు. ఈవీఎంలు, స్ట్రాంగ్ రూములు ఇలా వాటి చుట్టే కధ నడుపుతున్నారు.


లేటెస్ట్ గా మంత్రి నక్కా ఆనందబాబు మరి కొందరు నాయకులు ఈవీఎంల భద్రతపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులోని కొన్ని స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరచిన చోట సీసీ కెమెరాలు సరిగ్గా అర్ధరాత్రి దాటిన తరువాత ఆగిపోతున్నాయట. దాంతో ఎక్కడలేని డౌట్లను టీడీపీ నాయకులు బయటపెడుతున్నారు. ఎందుకలా హఠాత్తుగా ఆగిపోతున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ అంటూ వారు ఆరా తీస్తున్నారు. 


దీని వెనక కూడా కుట్ర ఉండొచ్చని ఆరోపిస్తునారు. నిజానికి స్ట్రాంగ్ రూములకు నాలుగు అంచల గట్టి భ‌ద్రత ఉంటుంది. వాటిని చేదించి ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి వెళ్ళలేరు.  మరో వైపు జామర్లు కూడా అక్కడ అమరుస్తారు. ఎటువంటి సిగ్నల్స్ కూడా అక్కడకు  రావు, మొబైల్స్ పనిచేయవు. మరి ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయినా సరే ఈవీఎంల భద్రతపైన సీసీ కెమెరాల మీద తమ్ముళ్ళు ఆరోపణలు చేయడం ఓ విధంగా ఆశ్చ‌ర్యంగానే ఉంది. మరి అధికారులు చెబుతున్న ప్రకారం సీసీ కెమెరాలకు వీటికీ  అసలు సంబంధం లేదు అని. అయినా  తమ్ముళ్ళు నానా యాగీ చేస్తున్నారు 



మరింత సమాచారం తెలుసుకోండి: