ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు ఎన్నికల హడావుడి బీభత్సంగా నడిచింది.  ఈ నెల 11 న పోలింగ్ ముగిసింది.  అయితే నేతలు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో టీడీపీ నేతలు మాత్రం ప్రతి రోజు ఎక్కడో అక్కడ ప్రెస్ మీట్స్ పెట్టి ఊదగొడుతున్నారు.  తాజాగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి  నీటి పారుదల శాఖలో దేవినేని ఉమ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.   

ప్రజలు అమాయకులు కారని..ఐదు సంవత్సరాల పాలన చూసిన తర్వాత వారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుకున్నారని..సరైన ప్రభుత్వం రావాలనే చూస్తున్నారని అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నాలుగు వారాలు ఓపిక పడితే, నీటి పారుదల శాఖలో దేవినేని ఉమ చేసిన అరాచకాలు, అక్రమాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. 


 ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్టర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?" అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: