నిజమే ఈ దేశాన్ని ఏలింది కాంగ్రెస్, అలా ఇలా కాదు ఏకంగా ఆరు దశాబ్దాలకు పైగా పాలించింది. మూడు తరాలు ప్రధానులుగా  అందులో సగానికి పైగా కాలాన్ని  పాలించారు. ఒక దేశం ఒక పార్టీ, ఒక కుటుంబం ఇలా సాగిపోయింది భారత్ కధ. మంచి చెడ్డా తేడా కూడా తెలియని విధంగా నాటి పాలన సాగింది 


మరిపుడు చూస్తే కిచిడి పార్టీల పాలన, బీజేపీలో వాజ్ పేయి మోడీ పాలన తీసుకున్నా కాంగ్రెస్ పాలన కాలానికి మూడవ వంతు కూడా చేరుకోలేరు. ఇన్నాళ్ళు ఏలిన కాంగ్రెస్ హయాం దేశం బాగానే చూసింది. అంతెందుకు సరిగ్గా అయిదేళ్ళ క్రితం యూపీయే టూ పాలనలో దేశంలో పూటకో స్కాం కూడా చూసింది ఈ దేశం. అవినీతి బంధుప్రీతి ఇలా అన్ని జాడ్యాలు కలగలిపిన కాంగ్రెస్ జమానాను చూసిన తరువాతనే మోడీని ఎన్నుకున్నారు


మరిపుడు అయిదేళ్ళు పూర్తి కాగానే మంచి రోజులు దేశానికి రావాలంటే కాంగ్రెస్ రావాలని అంటున్నారు. కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలు జనం మరచిపోయారన్నదే ధీమా కాబోలు. యువరాజు ప్రధాని అయితే ఆయనకు మంచి రోజులు వస్తాయి. కాంగ్రెస్ పరివారం, చుట్టు పక్కల ఉన్న వారు పదవులు తీసుకుంటే మంచి రోజులు వస్తాయి. మరి నూటా పాతిక కోట్లకు పైబడి ఉన్న వారికి మంచి రోజులు ఎలా వస్తాయి. ఘనత వహించిన రాహుల్ బాబాయే దీనికి జవాబు చెప్పాలి. 


మోడీ దిగిపోవాలి. మేము రావాలి ఇదే బాధ తప్ప కాంగ్రెస్ పాలనలో తప్పులకు ఎపుడైనా క్షమాపణ చెప్పారా. మళ్ళీ చేయమని లెంపలు వేసుకున్నారా. ఎన్ని రకాలుగా అనుకున్నా మోడీ పాలనలో అవినీతి లేదు. ఇది ఒక్కటి చాలు కాంగ్రెస్ ని ఎందుకు మళ్ళీ ఎన్నుకోకూడదో చెప్పడానికి.


మరింత సమాచారం తెలుసుకోండి: