ప్రతి సారి బాబు గారికి కొర్టులొ ఉన్న కొంతమంది జడ్జులకి మంచి సంబందాలు ఉన్నాయి వివిద రుపాలలొ బయటికి వస్తునే ఉంది.. 2015 జూలైలో తెలంగాణ లొ అడిషినల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు ఓటుకు నొటు కేసు విషయం లొ హైద్రబాద్ హై కోర్టు లొ 70% లాయర్లు, జడ్జీలు బాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని అన్న విషయం తెలిసిందే .

https://www.youtube.com/watch?v=X-jwG2ghY0U  (ఈ వీడియో పై క్లిక్ చేయండి)


మొన్నఎకనామిక్స్ టైంస్ అనే జాతీయ పెపర్ లొ బాబు గారికి ఒక judge గారికి విడదీయరాని అనుబంధం ఉంది అని రాసింది... అందులో ఏకంగా సుప్రీం కోర్టు జ్జీ కూడా ఒప్పుకున్నట్లు చెప్పింది ఆ సదరు పత్రిక. ఇప్పుడు తాజాగా జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇలాంటి ఆరొపణాలే చేశారు - నేడు న్యాయస్థనాలలొ కూడా న్యాయం జరిగే పరిస్థితులు కనిపించటం లేదు ఇక్కడ ముఖ్యమంత్రికి సంభందించిన జడ్జి గారు సుప్రీం కొర్టు లొ ఉండటం వలన ఆయన మీద హైకొర్టు లొ కొన్ని పెండింగ్ లొ ఉన్న కేసులు అవి బయటికి రావటాం లేదు సప్రెస్ అవుతున్నాయి.


అందుకే వెంకపడిన బి.సి వర్గం వాళ్ళు బ్రహ్మణులని, యస్.సీ కులం వాళ్ళని జడ్జీలుగా చెయాలి అని లిస్టు పంపిస్తే వాళ్ళాకి అరహత లేదు అని  3 రొజుల వ్యవది లొ ఇద్దరు కూడపలుక్కుని వాళ్ళని పక్కన పెట్టారు దీనికి కారణం సుప్రీం కొర్టు జడ్జీలని వాళ్ళ చెప్పు చెతలలొ పెట్టుకొవాలనే ఇలా చేశారు అని తీవ్ర ఆరొపణాలు చేశారు. 2003 లొ చంద్రబాబు పాలన లొ ఉన్నప్పుడు మన హైకొర్టు పై , మన న్యాయవ్యవస్థ పై ఇంగ్లాండు కి చెందిన జేంస్ మ్యానర్ అనే నిపుణుడు కొన్ని వ్యాఖ్యలు చెసారు.


దాని సారాంసం ఇది :

భారత న్యాయ వ్యవస్థ నిజంగా స్వతంత్రమైనది కాని తెలివైన ముఖ్యమంత్రులు కొన్ని సార్లు న్యాయ మూర్తుల పై తమ ప్రభవాన్ని ప్రసరింప చెయగలుగు తున్నారు , ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంద్రప్రదేశ్ హైకొర్టు విషయం లొ ఇదే చాతుర్యం ప్రదర్శిస్తున్నారని రిటైర్డ్ న్యాయమూర్తులు , సీనియర్ న్యాయ వాదులు బలం గా విశ్వసిస్తున్నారు. ఇందికొసం ఆయన తనకు విశ్వాసపాత్రుడైన ఒక అడ్వకేట్ జనరల్ ను వినియొగిస్తున్నారు , ఆ అడ్వకేట్ జనరల్ హైకొర్టు తొ సంస్థాపరమైన , వ్యక్తిగతమైన సంభందాలు నెల్కొల్పడం లొ కీలక పాత్ర వహిస్తున్నాడు, వీటి ద్వార అతడు న్యాయ మూర్తులనుండి గౌరవ ప్రపత్తులు కూడా పొందుతున్నాడు ఎంతొ నైపుణ్యం ప్రదర్శించి వారి తొ భాందవ్యం నెల్కొల్పుకున్నాడు.


ఈ మాటలు అనటం ద్వారా చంద్రబాబు రాష్ట్ర హైకొర్టు ని నియంత్రిస్తున్నాడు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. అయితే హైకొర్టు పై ముఖ్యమంత్రికి చెప్పుకొదగ్గ పలుకుబడి ఉన్నది అనేది మాత్రం నిజం. హైకొర్టు ప్రధాన న్యాయమూర్తులతొ తనకు ఉన్న సస్సంభంధాలు ఉపయొగపెట్టి తన సొంత న్యాయవాదులు ఇద్దరిని హైకొర్టు న్యాయమూర్తులు గా నియమింపచెయగలిగారు. దానితొ వీరు ఇద్దరు పక్షపాత పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకాల వల్ల హైకొర్టు పై చంద్రబాబు పలుకుబడి మరింతగా పెరిగిపొయింది. రాజకీయంగా ఈ పరిణామాలు ఎంతొ ప్రశంసనీయమైనవి కాని న్యాయవ్యవస్థ సంస్కరణల ద్రుష్టి లొ చూస్తే మాత్రం సహేతుకం కావు.


చంద్రబాబు కొర్టుపరంగా చెస్తున్న ఈ పనులు పేద ప్రజలకు న్యాయ సౌకర్యం కల్పించటానికి కాని , స్వాతంత్ర న్యాయ సాధనకు కాని, కొర్టులొ పేరుకుపొతున్న పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటానికి కాని, జిల్లా స్థాయి న్యాయస్థానాలలొ పేరిగిపొతున్న అవినీతి ని అరికట్టటం లొ కాని ఎంతమాత్రం ఉపకరించేవి కావు.


నేర పరిసొదక సంస్థ పై అధికారం లొ ఉండే పార్టికి పూర్తి పెత్తనం లభిస్తుంది , తమకు కావాల్సిన వారిపై నేరారొపణలు ఉపసమ్హరించుకొగలుగుతున్నారు. తమకు గిట్టనివారి పై ఉద్దేశ పూర్వకంగా లేనిపొని విచారణ జరిపిస్తున్నారు , మిగిలిన రాష్ట్రాల వలే ఇక్కడకూడా ఈ సంస్థ పెత్తనం ని స్వార్ధం కొసం దుర్వినియొగం చెస్తున్నారు.


భారతీయ న్యాయ కమీషన్ 114వ నివేధిక లొ పేర్కొన్నట్లు స్థానిక కొర్టులకు ఒక మొడల్ పద్దతి అనుసరించటం ద్వారా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించవచ్చు, ఎన్.టి రామారావు అధికారం లొ ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా లొ ఒక చట్టం చెసి రాష్ట్రపతి ఆమొదం కొసం కూడా పంపింది. అయితే చంద్రబాబు పదవి చెపట్టగానే ఆ చట్టం ని నిశబ్దంగా ఉపసహరించివేశారు.


ఇంగ్లాడ్ నిపుణుడు జేంస్ మేనర్ ఏ కాకుండా అప్పట్లొ (2003 లొ) ఒక న్యాయమూర్తి కూడా ఇటువంటి వ్యాఖ్యలే చెసారు " న్యాయస్థానాలలొ అశ్రిత పక్షపాతం పెరిగిపొతున్నది అని స్వార్ధ శక్తులు కేసులలొ న్యాయాన్ని తారుమారు చెయగలుగున్నారు అని, సహ న్యాయమూర్తులైనా సరే తమ దారికి అడ్డం వచ్చేవారిని ఈ శక్తులు వేదింపులకి గురిచెస్తున్నాయి అని ఆ న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చెసారు.


ఇందులొ ఉన్న ప్రతి అక్షరం మా సొంత అభిప్రాయం కాదు , ఆ నాడు ఆ ఇంగ్లాండు నిపుణుడు అభిప్రాయాని అప్పటి ఒక ప్రముఖ పత్రిక రాసిన సంపాదకీయం.



మరింత సమాచారం తెలుసుకోండి: