మే 23వ తేదీ మొదలయ్యే కౌంటింగ్ తాలూకు ఫలితాల కోసం యావత్ తెలుగు ప్రజలతో పాటు ఒక విధంగా దేశమంతా ఎదురు చూస్తోంది. అయితే అందరూ అనుకున్నట్లుగా ఎప్పటి ఫలితాలు అప్పుడు తెలుసుకునేందుకు లేదట. ఒకపుడైతే కౌంటింగ్ అయిపోగానే అనధికారికంగా ఫలితం తెలిసిపోయేది. కానీ మే 23వ తేదీన కౌంటింగ్ లో ఆ విధంగా ఫలితాలు తెలియవట.

 

సుప్రింకోర్టు ఆదేశాల వల్లే ఫలితాల్లో బాగా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ పూర్తియపోగానే ఫలితాన్ని ప్రకటించ వద్దని సుప్రింకోర్టు ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చింది. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఐదు కేంద్రాలను ర్యాండంగా  తీసుకుని అందులో ఉన్న ఈవిఎంల్లోని వివి ప్యాట్లను కూడా లెక్కించమని ఆదేశించింది సుప్రింకోర్టు.

 

అంటే ర్యాండంగా తీసుకునే ఈవిఎంల్లోని ఓట్లు, వాటిల్లోని వివి ప్యాట్ల ఓట్లు సరిపోవాలి. అలా సరిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఎన్నికల అధికారులు సదరు నియోజకవర్గంలోని ఫలితాన్ని ప్రకటించాలి. లేకపోతే ఫలితం ప్రకటించటాన్ని నిలిపేస్తారు.

 

మామూలుగా అయితే ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ తో ఓ రెండు గంటల తర్వాత ట్రెండింగ్ ఎలాగుందో తెలిసిపోతుంది. దాదాపు ఆ ట్రెండింగ్ ఆధారంగానే చివరి ఫలితం కూడా ఉంటుంది. దాంతో రిజల్డ్ ఏమిటో ఎవరికి వారుగా అంచనా వేసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చివరి ఫలితం కూడా వచ్చేస్తుంది. అయితే వివి ప్యాట్ల పై సుప్రింకోర్టు ఆదేశాలతో సాయంత్రమో లేకపోతే రాత్రికూడా అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఫలితం తేలటానికి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: