ఆదాయపు పన్ను బకాయిల నిమిత్తం.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన వేద నిలయాన్ని జప్తు చేశామని మద్రాసు హై కోర్టుకు ఐటి శాఖ కు తెలిపింది. జయ లలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని వేయాలని కోరుతూ.. అన్నాడిఎంకె ప్రముఖుడు పుహలేంది మద్రాస్‌ హై కోర్టులో పిటిషన్‌ వేశారు. అనారోగ్యం కారణంగా 2015 డిసెంబరు 5న అన్నాడీఎంకే అధినేత్రి, అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమెకు సంబంధించిన ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక కేకే నగర్‌కు చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడు పుహళేంది మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. 

ఈ కేసుకు సంబంధించి చెన్నై ఐటీ అధికారులు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. పోయస్ గార్డెన్ లోని జయ ఇల్లు వేద నిలయంతో పాటు ఆమె ఆస్తులను జప్తు చేసినట్టు అందులో పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ప్రకారం జయకు రూ. 16.37 కోట్ల విలువైన స్థలం, కారు, బ్యాంక్ లో రూ. 10 కోట్లు ఉన్నాయి.   1990 నుంచి 2012 వరకు జయ పన్ను చెల్లింలేదు.

2005-06 నుంచి 2011-12 వరకు రూ.6.62 కోట్ల పన్ను చెల్లించలేదు.  రూ. వెయ్యి కోట్ల విలువ ఉండే జయ ఆస్తుల నిర్వహణకు ప్రత్యేక కమిటీ వేయాలని కోరడం సరికాదని అన్నారు.  ఇరుతరపు వాదనల అనంతరం ఈ కేసు తుది విచారణను వచ్చే జూన్‌ 6వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: