ఏపీలో ఎవరు కొత్త సీఎం అన్న దానిపై సస్పెన్స్ ఓ వైపు సాగుతూంటే నేనే సీఎం అంటూ చంద్రబాబు ఓ వైపు చెప్పుకుంటున్నారు. మరో వైపు జగన్ సైతం తాను కచ్చితంగా అధికారంలోకి వస్తానని నమ్ముతున్నారు. జగన్ ఈ విషయంలో ఫుల్ కాంఫిడెంట్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇపుడు విహార యాత్రలో ఉన్న జగన్ కూల్ గా రోజులు గడుపుతున్న సంగతి తెలిసిందే.


ఇక వచ్చే నెల 23న ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఫలితాల్లో ఎవరు అధికారంలోకి వస్తారో తేలుతుంది. అయితే వైసీపీ తమకు 120 సీట్లకు పైగా వస్తాయని గట్టి విశ్వాసంతో ఉంది. అందువల్ల ఆ పార్టీ నేతలు జగన్ ప్రమాణ స్వీకారం డేట్ ని కూడా ప్రకటించేస్తున్నారు. వైసీపీ  ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు మాట్లాడుతూ, ఆ డేట్ చెప్పేశారు.


రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద బాబు పెత్తనం పోయింది. ఇది తెలిసే జూన్ 8 వరకూ నేనే సీఎం అంటున్నారు. ఇదేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. గెలుపుపై  మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. మే 26న ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి చంద్రబాబు జూన్ 8 దాకా ఎలా సీఎంగా ఉంటారు’ అని ప్రశ్నించారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం పై విశ్వాసం తో ఉన్న పార్టీ నేతలు ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా నిర్ణయించారు. మొత్తానికి ఏపీలో అధికార మార్పిడి కూడా ఓ యుధ్ధంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: