ప్రస్తుతం చంద్రబాబుకు .. సీఎస్ కు మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సీఎస్ బాహాటంగానే చంద్రబాబు మీద దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం రాకతో చంద్రబాబు చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉండే ఉద్యోగుల జీతాలకు చంద్రబాబు ఎసరుపెట్టారనే విషయం ఆల్రెడీ బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటివే మరిన్ని అతిముఖ్యమైన బిల్లుల్ని బాబు కమిషన్ల కోసం కక్కుర్తుపడి పక్కనపెట్టినట్టు సీఎస్ అధ్యయనంలో తేలింది. 


మంచినీటి సరఫరా బిల్లులు చెల్లించకపోతే ప్రజలకు తాగునీరు నిలిచిపోతుంది. పంచాయతీ రాజ్ బకాయిలు చెల్లించకపోతే గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోతుంది. ఎన్నో వేల వాటర్ ట్యాంకర్ల నిర్మాణం నిలిచిపోతుంది. సాంఘిక సంక్షేమంలో బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ఎంతోమంది పేద విద్యార్థులకు హాస్టళ్లలో భోజనం దొరకదు. ఇలా ప్రజలు అత్యంత అవసరమైన పనులవి. వీటన్నింటినీ చంద్రబాబు పక్కపెట్టేశారు. 


వీటికి సంబంధించిన ఏ ఒక్క బిల్లును క్లియర్ చేయలేదు. ఆ స్థానంలో ఆయనేం చేశారో తెలుసా..? తనకు కమిషన్లు ఎక్కువగా వచ్చే కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, నీరు-చెట్టు కార్యక్రమానికి నిధులు కేటాయించుకున్నారు. ఆ బిల్లుల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. హాస్టళ్లలో పేద విద్యార్థులకు భోజనం అవసరమా.. నీరుచెట్టు పథకానికి నిధులు అవసరమా అని ప్రశ్నించుకుంటే సమాధానం సులువుగా దొరికేస్తుంది. మనసున్న నేతలెవరూ ఇలాంటి బిల్లుల్ని నిర్లక్ష్యం చేయాలని అనుకోరు. కానీ చంద్రబాబుకు డబ్బే ముఖ్యం, కమీషన్లే కీలకం. అందుకే ఇలా ప్రజల్ని నడిరోడ్డుపై నిలబెట్టారు. అరాచక పాలనకు తెరతీశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: