హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్‌ ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు.    కొకైన్, ఇతర డ్రగ్స్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  గత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డ విషయం తెలిసిందే.  అయితే ఆ డ్రగ్స్ వాడేవారిలో విద్యార్థులు, రాజకీయ, సినీ తారలు ఉన్నారని ఆరోపణలు రావడం ఒక సిట్ ఏర్పాటు కావడం జరిగింది. ఆ సిట్ ముందు పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. 


హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్ది ఇక్కడ అక్రమ వ్యాపారాలు పెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆఫ్రికా.. ఘానాకు దేశానికి చెందిని నింధితులు.. గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించి కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు.  కొన్ని సార్లు  బెంగళూరు నుంచి అక్రమంగా నగరానికి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.


తాజాగా కొకైన్, ఇతర డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ నిఘా ఉంచారు. గుట్టు చప్పుడు కాకుండా  కస్టమర్లకు సప్లై చేస్తున్న ముఠాను  బంజారా హిల్స్ పీఎస్ పరిధిలో పట్టుకున్నారు.   నైజీరియాకు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ జాన్‌పాల్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  అతని  నుంచి రూ.4 లక్షల 65 వేల విలువైన 20 గ్రాముల కొకైన్, 9 ఎండీఎంఏ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భం కొకైన్, ఇతర డ్రగ్స్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.  కాగా, గ్స్‌ స్మగ్లర్‌ జాన్‌పాల్‌ విజిటింగ్ వీసాపై 2008లో కేరళకు వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నాడని, 2015 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాడని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: