ఆయ‌న న‌డిచిన దారి అసామాన్యం. ఆయ‌న ప‌డ్డ క‌ష్టాలు అన‌న్య‌సామాన్యం. ప్ర‌తి అడుగూ.. ఎదురీతే.. ప్ర‌తిక్ష‌ణం.. ఎదురీ తే! ఆయ‌న స్థానంలో మ‌రెవ‌రైనా ఉండి ఉంటే.. నేడు చెప్పుకొనేందుకు ఏమీ మిగిలేది కాదు. స‌ముద్రంలో సింధువుగా మారి పోయి.. అనేక బిందువుల్లో ఒక‌రుగా మారి ఉండేవారు. కానీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఎన్ని ఇబ్బందులు స్వాగ తం ప‌లికినా.. మొక్క‌వోని ధైర్యంతో ముందుకు సాగి.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుని, అన‌నుకూల‌త‌నే సాను కూలంగా మ‌లుచుకుని ముందుకు సాగారు. ఆయ‌నే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి. దివంగ‌త వైఎస్ త‌న‌యు డిగా ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చినా.. వైఎస్ జీవించి ఉండ‌గా పెద్ద‌గా ఎవ‌రికీ ఆయ‌న గురించి కానీ, ఆయ‌న కానీ తెలియ‌ద‌నే చెప్పాలి.


వైఎస్ హ‌ఠాన్మ‌ర‌ణానంత‌రం మారిన రాజ‌కీయాలు.. ఎదురైన అవ‌మానాలు.. జ‌గ‌న్‌లోని ప్ర‌జ‌ల మ‌నిషిని తెలుగు ప్ర‌పంచా నికి ప‌రిచ‌యం చేశాయి. 2009 నుంచి 2019 మ‌ధ్య గ‌డిచిన ద‌శాబ్ద‌కాలంలో జ‌గ‌న్ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అలుపెరుగ ని మ‌నిషిగా.. త‌నకంటూ ప్ర‌త్యేక వేదిక‌ను ఏర్పాటు చేసుకున్న మ‌హామ‌నీషిగా గుర్తింపు సాధించారు. వైఎస్ జీవించి ఉన్న స‌మ‌యంలో తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంత చేరువ అయ్యారో.. అంత‌కు నాలుగింత‌లుగా ఎలాంటి అధికారం లేక‌పోయినా.. ప్ర‌జ ల‌కు త‌ల్లోనాలిక‌గా మారారు వైఎస్ జ‌గ‌న్‌. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా జ‌గ‌న్ గురించి తెలుసుకున్న వారు తెలుసుకుంటున్న‌వారు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నారు. 


ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అనుస‌రించిన వైఖ‌రి, ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన తీరు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందాయి. ఎక్క డా దిగుజారుడు రాజ‌కీయాలు చేయ‌కుండా హుందాగా వ్య‌వ‌హ‌రించిన తీరు ప్ర‌తి ఒక్క‌రిని ముగ్ధుల‌ను చేసింది. అయితే, ఈ ఆద‌ర‌ణ‌, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌తిఒక్క‌రికీ చేరువ కావ‌డం అనేది జ‌గ‌న్‌కు రాత్రికి రాత్రి వ‌చ్చిన అవ‌కాశం కాదు.. అదృష్ట‌మూ కాదు. దీని వెనుక క‌ఠోర ప‌రిశ్ర‌మ ఉంది. ఆత్మ‌విశ్వాసం ఉంది. అంతుకు మించి త‌నవెంట ప్ర‌జ‌లు ఉన్నార‌నే మొక్క‌వోని ధైర్యం ఆయ‌న‌ను న‌డిపించింది. తారీకులు, ద‌స్తావేజులు తిర‌గేస్తే.. జ‌గ‌న్ చేసిన ప‌రిశ్ర‌మ‌, ప్ర‌జ‌ల మ‌నిషిగా త‌న‌ను తాను మ‌లుచుకున్న తీరు క‌ళ్ల‌కు క‌డ‌తాయి. 


2009: క‌డప ఎంపీగా పోటీ. కాంగ్రెస్ త‌ర‌ఫున ప్రచారం. గెలుపు 
2009: త‌ండ్రి వైఎస్ హ‌ఠాన్మ‌ర‌ణం
2009:  వైఎస్ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాల‌కు ఓదార్పు. అయితే, దీనిని త‌ట్టుకోలేని కొంద‌రు కాంగ్రెస్ నాయ‌కులు, వీరికి జ‌త‌క‌లిసిన టీడీపీ అధినేత‌తో క‌లిసి జ‌గన్‌పై కుట్ర‌లు ప్రారంభం
+ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు 
+ ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ వ్యాపార సంస్థ‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ అక్ర‌మ కేసుల న‌మోదు.
+ జ‌గ‌న్‌ను ఆర్థికంగా దెబ్బ‌తీసే కుట్ర‌. 
+ దీనిలో భాగంగానే ఆయ‌న‌కు 16 నెల‌ల జైలు
+ 2012 సొంత‌గా వైసీపీ ప్రారంభం. అదే సంవ‌త్స‌రం త‌న‌తో క‌లిసి న‌డిచేందుకు వ‌చ్చిన నేత‌ల‌తో ఉప ఎన్నిక‌కు. 
+ 2014 ఎన్నిక‌ల్లో సింగిల్‌గా పోటీ. 
+ కేవ‌లం 2% ఓట్ల తేడాతో ప‌రాజ‌యం.
+ అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం అలుపెరుగ‌ని పోరాటం
+ ప్ర‌త్యేక హోదాను స‌జీవంగా ఉంచేందుకు త‌న‌దైన వ్యూహంతో ముందుకు
+ 2017లో నంద్యాల ఉప ఎన్నిక 
+ అడుగ‌డుగునా అడ్డుత‌గిలిన న‌ల‌భైఏళ్ల అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబు
+ అయినా అసెంబ్లీలో బ‌ల‌మైన గ‌ళం.. మైక్ క‌ట్ చేయ‌డంతో నిర‌స‌న‌
+ తాజా ఎన్నిక‌ల్లో మ‌రోసారి హోరా హోరీ పోరు. అధికారం ద‌క్కించుకునే దిశ‌గా ప‌య‌నం. 
+ ఒక ప‌క్క త‌న‌పై పెట్టిన అక్ర‌మ కేసుల విష‌యంలో న్యాయ పోరు.. మ‌రోప‌క్క‌, ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ప్ర‌జా పోరు.


మరింత సమాచారం తెలుసుకోండి: