ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సూత్రపాయంగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అర్ధం అవుతుంది. ఒక పక్కేమో జగన్ ప్రశాంతంగా గెలుపు తమదేనని ధీమాతో ఉంటే చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారు. అయితే ఇరవై నియోజకవర్గాల్లో టీడీపీ డబ్బులు పంచడంలో విఫలం అయ్యింది..', 'ముప్పై నియోజకవర్గాల్లో జనసేన దెబ్బ తెలుగుదేశంపార్టీకి గట్టిగా తగిలింది..' యాభై నియోజకవర్గాల విషయంలో అలాంటి రీజన్లను చెప్పేశారు. ఇక ఇప్పుడు మూడో రీజన్ 'పోలీసులు చాలాచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించారు..' అనేది.


ఇది ఎన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తుందో సంఖ్యాపరంగా చెప్పలేదు కానీ.. 'పోలీసులు తెలుగుదేశం పార్టీకి సహకరించలేదు.. దీంతో ఆ పార్టీ వాళ్లు అవాక్కయ్యారు..' అని తోక మీడియా రాసుకొచ్చింది. ఇదెలా ఉందంటే.. తెలుగుదేశం పార్టీకి పోలీసులు కచ్చితంగా సహకరించాల్సింది, అయితే వారు మోసం చేశారు.. అని ఆ పత్రిక ఫిర్యాదు చేస్తున్నట్టుగా ఉంది! తెలుగుదేశం పార్టీకి సహకరించకుండా పోలీసులు మోసం చేశారని ఆ పత్రిక వాపోతూ ఉంది. 'తెలుగుదేశం పార్టీకి పోలీసులు కూడా సహకరించలేదు..' అంటూ సానుభూతిని పెంచాలనే ప్రయత్నం జరుగుతోంది.


ఈ కథలన్నింటినీ గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఓటమికి సాకులను అనుకూల మీడియానే రెడీ చేస్తున్నట్టుగా అనిపిస్తే అది అనుకునే వాళ్ల తప్పుకాదు. అవతల చంద్రబాబేమో 'ఈవీఎంలను ట్యాంపర్ చేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరచకాలకు పాల్పడింది.. డబ్బులు పంచింది..' అంటూ మాట్లాడుతున్నారు. ఇవతల ఆయన భజంత్రీ మీడియానేమో..'టీడీపీ డబ్బులు పంచలేకపోయింది, జనసేన, పోలీసులు..' అంటోంది. ఇందు మూలంగా అర్థం చేసుకోవాల్సిందేమిటో వారే సూటిగా, స్పష్టంగా చెబుతున్నట్టుగా ఉన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: