ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 11 న పోలింగ్ జరిగింది.  గత మూడు నెలల నుంచి అన్ని పార్టీల అధినేతలు తమ శక్తివంచన మేరకు ప్రచారాలు చేశారు.  అధికార పార్టీ టీడీపీ తాము చేసిన అభివృద్ది పనులు తమను గెలిపిస్తాయని విస్తృతంగా ప్రచారాలు చేశారు.  ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై రక రకాల కామెంట్స్ చేస్తూ ప్రచారాలు కొనసాగించారు.  అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా మాట తూలకుండా ఐదేళ్లలో అధికార పార్టీ ప్రజలకు ఏం చేసిందో కళ్లకు కట్టినట్లూ చూపించారు..మాట్లాడారు.  పేదల వద్దకు కాలి నడకన వెళ్లారు..ప్రజాసంకల్ప యాత్రతో అందరి హృదయాలు గెల్చుకున్నారు.  


తన తండ్రి జనహృదయ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమాల గురించి వివరిస్తూ..తాను అధికారంలోకి వస్తే తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.  నేను విన్నాను..నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు.  ఎన్ని పార్టీలు ఏం మాట్లాడినా ఎన్ని అపవాదులు వేసినా మొక్కవోని మొండి ధైర్యంతో ప్రజల్లోకి వెళ్లారు.  ఇదే సమయంలో తన చిన్నాన్న వైఎస్ వివేకా మరణం కలచివేసినా..ధైర్యంతో ముందడుగు వేశారు.


ఇదే జగన్ పై ప్రజల నమ్మకం పెరిగేలా చేసింది. ఆయన సీఎం గా చేయాలనే ప్రతి ఒక్కరూ భావించేలా చేసిందని..అందుకే కనీ వినీ ఎరుగని రీతిలో ఓటింగ్ పెరిగిందని..వచ్చేది జగన్ పాలనే అని అంటున్నారు.  ఇదే విషయాన్ని పలు సర్వేలు కూడా నిర్దారణ చేశాయి.  తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. బొత్స సోదరుడు అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహం విశాఖపట్నంకు చెందిన రవితేజతో నేడు రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్ జరగగా జగన్ వివాహాని హాజరయ్యారు. 


అయితే, జగన్ రాకతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. "సీఎం, సీఎం" అంటూ నినాదాలతో పెళ్లివేదికను హోరెత్తించారు. ఓ దశలో పెళ్లిమంత్రాలు, మంగళవాయిద్యాల హోరును మించిపోయి నినాదాలు చేశారు. అభిమానుల ఉత్సాహం చూసి జగన్ సైతం ఆశ్చర్యపోయారు.  కాగా, ఈ పెళ్లికి జగన్ తో పాటు పార్టీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: