తీగ లాగితే డొంక కదిలినట్టుంది మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటన ఖర్చు వ్యవహారం.. ఈ ఏడాది జనవరిలో దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం  జరిగింది. దానికి ఇండియాలోని చాలా మంది ముఖ్యమంత్రులు, మంత్రులు వెళ్లారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ దావోస్ సదస్సు కోసం 1.58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 


దీంతో ఆ రాష్ట్రంలో ఇదో పెద్ద ఇష్యూు అయ్యింది. అవినీతి వ్యతిరేక పోరాట కార్యకర్త అజయ్ దుబే సమాచార హక్కు చట్టం ద్వారా ఈ ఖర్చుల వివరాలు కావాలని దరఖాస్తు చేశారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాధ్ ఖర్చును సమర్ధించుకునేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలను కూడా బయటపెట్టారు 

వారు ఇచ్చిన సమాచారం మేరకు.. మధ్యప్రదేశ్ సీఎం ఖర్చు కోటీ అరవై లక్షలు అయితే.. మన మంత్రిగారు ఖర్చు ఏకంగా 16 కోట్లు రూపాయలు. ఈ సమావేశంలో మిగిలిన రాష్ట్రాలు పాల్గొన్నా.. ఈ స్థాయిలో మాత్రం ఎవరకూ ఖర్చు చేయలేదని టాక్. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిసారీ మన బీదరికం గురించి గుర్తు చేస్తూనే ఉంటారు. 

మరి ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ ఈ టూర్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా.. తెలంగాణ 9 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర మాత్రం 7.63 కోట్ల రూపాయల వ్యయం చేసింది. ఇంతకీ అన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్లిన పర్యటన ద్వారా ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెబితే బావుంటుందంటున్నారు విశ్లేషకులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: