ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం సుదీర్ఘ నిరీక్షణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. గెలుపు ఎవరిని వరిస్తుదో తెలియడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. 


తాజాగా ఇంటలిజెన్స్ పేరుతో ఓ సర్వే కలకలం సృష్టిస్తోంది. తూర్పు గోదావరి మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం విజయఢంకా మోగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ  తూర్పు గోదావరి  జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుచుకుంది. వైసీపీ కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకోగా.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. 

తాజాగా ఇంటలిజెన్స్ సర్వే పేరిట సర్క్యులేట్ అవుతున్న సర్వే ప్రకారం.. టీడీపీ  8 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందట. ఇక వైసీపీ 11 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందట.  

వైసీపీ గెలిచేవి : తుని, ముమ్మడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, అమలాపురం, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, రంపచోడవరం, గన్నవరం 

టీడీపీ గెలిచేవి : పెద్దాపురం, రాజమండ్రి సిటీ, మండపేట, రాజోల్, రాజానగరం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ , రామచంద్రాపురం

ఐతే.. సోషల్ మీడియాలో ఎవరుపడితే వారు సొంత సర్వేలను తప్పుడు పేర్లతో సర్క్యులేట్ చేస్తున్నారన్న వార్తలూ వస్తున్నాయి. కాకపోతే.. ఉత్కంఠతో ఉన్న వారు ఏదో ఒక సమాచారం కోసం అంటూ వీటిని ఫాలో అవుతున్నారు. అసలు విషయం మే 23న కానీ తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: