మొదటి నుంచి ఎస్సి సామజిక వర్గం కాంగ్రెస్ పార్టీ తరుపున నిలిచింది. వైఎస్ మరణం తరువాత ఆ సామజిక వర్గం జగన్ కు అండగా నిలబడ్డారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్ డ్ సీట్లతో పాటు ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లలో భారీ ఎత్తున పోలింగ్ పర్సంటేజీ పెరిగింది. జనరల్ స్థానాల్లో కంటే రిజర్వ్డ్ సీట్లకు జరిగిన పోలింగ్ లో భారీ ఎత్తున పెరుగుదల కనిపించింది. గడచిన ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని ఎస్సీ - ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లలో మెజారిటీ సీట్లను వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే.


ఏపీ అసెంబ్లీలో మొత్తం సీట్లు 175 కాగా... వాటిలో 29 సీట్లు ఎస్సీ రిజర్వ్ డ్ కాగా - 7 సీట్లు ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు. ఈ లెక్కన ఎస్సీ - ఎస్టీ రిజర్వ్ డ్ సీట్ల సంఖ్య ఏకంగా 36కు చేరుతుంది. ఈ సీట్లన్నింటిలో మొన్నటి పోలింగ్ లో పెరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే... ఆ సీట్లన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడిపోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఎస్సీ ఎస్టీలంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే.


ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఎస్సీలు మరింతగా కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వైఎస్ అకాల మరణంతో కాంగ్రెస్ లో ఇమడలేక బయటకు వచ్చేసిన జగన్ వెన్నంటి నడుస్తున్న ఈ వర్గాలు... ఈ సారి ఎలాగైనా జగన్ ను సీఎం చేసుకోవాలన్న లక్ష్యంతో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో సంక్షేమంలో తామెంతో చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఈ స్థానాల్లో పెరిగిన పోలింగ్ పెద్ద దెబ్బ కొట్టేయడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: