ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించిన ఫ‌లితాల్లో త‌ప్పులు త‌లెత్తిన మాట నిజ‌మేన‌ని త్రిస‌భ్య క‌మిటీ వెల్ల‌డించింది. ఈ మేర‌కు త్రిస‌భ్య క‌మిటీ త‌మ‌కు నివేదిక ఇచ్చిన‌ట్లు విద్యాశాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా విద్యాశాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 531 మంది జాగ్ర‌ఫీ విద్యార్థుల‌కు ప్రాక్టిక‌ల్ మార్కులు ప‌డ‌లేద‌ని క‌మిటీ గుర్తించిన‌ట్లు తెలిపారాయ‌న‌. 

ప్ర‌ధాన స‌బ్జెక్టుల విష‌యంలో ఫ‌లితా తేడారాలేద‌న్నారు. 496 మంది విద్యార్థుల విష‌యంలో ఎగ్జామ్ సెంట‌ర్‌లో కేటాయింపుల్లో త‌ప్పులు జ‌రిగిన‌ట్లు తెలిపారు. అందువ‌ల్లనే ఆబ్‌సెంట్ -పాస్ అనే గంద‌ర‌గోళం ఏర్ప‌డిన‌ట్లు మీడియాకు వివ‌రించారు జ‌నార్దన్‌రెడ్డి. ఒక ఓఎంఆర్ షీట్‌లో మాత్రం స‌రిగా బ‌బుల్ చేయ‌క పోవ‌డం వ‌ల్ల 99 మార్కుల‌కు బ‌దులు సున్నా మార్కులు వ‌చ్చాయ‌ని అన్నారు. దీనికి సంబంధించి అధికారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 

ఇక పరీక్షా ఫీజుల పేమెంట్‌ గేట్‌వే విషయంలో సర్వర్‌ ఆగిపోవడం లాంటి సమస్యలు తలెత్తాయన్నారు. ఈ నేప‌థ్యంలో వాటి సామ‌ర్థ్యం పెంచాలంటూ క‌మిటీ సిఫార్సు చేసిన‌ట్లు జ‌నార్ధ‌న్‌రెడ్డి మీడియాకు వివ‌రించారు.అయితే ఏమైనా త‌ప్పులు జ‌రిన‌ట్లు ఫిర్యాదు అందితే దానికి సంబంధించిన అధికారికి ఎస్ఎంఎస్ పంపేలా చూసుకోవాల‌ని క‌మ‌టీ సిఫార్సు చేసింద‌ని పేర్కొన్నారు. అయితే గ‌తేడాది 80 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల‌కు ఈసారి ఫెయిల్ అయితే వారికి ఉచితంగా రీ వెరిఫికేష‌న్ చేస్తామ‌న్నారు. 

ప్ర‌స్తుత ఏజెన్సీ డేటా ప్రాసెసింగ్ చేస్తున్న‌ట్లుగానే.. దీనికి ఈక్వ‌ల్గా మ‌రో ఏజెన్సీతో కూడా డేటా ప్రాసెసింగ్ చేయించాల‌ని క‌మిటీ సిఫార్సు చేసింది. ఆ త‌ర్వాత ఆ రెండు ఏజెన్సీలు ఇచ్చిన ఫ‌లితాల‌ను క‌రెక్ట్ వ‌చ్చాయో లేదోన‌ని చెక్ చేసుకోవాల‌ని కమిటీ బోర్డుకు సూచించింది. అంతా ఓకే అనుకుని.. వంద శాతం క‌రెక్ట్ ఉందా లేదా అని నిర్దారించుకున్న త‌ర్వాత‌నే విడుద‌ల చేయాల‌ని సూచించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: