మండే ఎండలతో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచంచలోని అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నా ప్రాంతాల్లో టాప్ 15లో దాదాపు అన్నీ ఇండియాలోనే ఉన్నాయని మొన్న ఓ నివేదిక చెప్పింది. 


ఇప్పుడు ఉత్తరాది ఎండల వార్త వింటే అది నిజమే అనిపిస్తోంది. ఉత్తరాదిలో ప్రత్యేకించి రాజస్థాన్, గుజరాత్‌లో ఎండలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. దాదాపు 50 డిగ్రీలు దాటిన ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

ఎండలు ఏ రేంజ్‌లో ఉన్నాయంటే.. ఎండ వేడిమికి రోడ్లపై తారు కరిగిపోతోంది. తారు రోడ్లపై నడిచేవారు చెప్పులు తారుకు అంటుకుపోయి.. నడవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే.. చెప్పులు తారులో ఇరుక్కుపోయి కిందపడిపోతున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు తక్కువేమీ లేవు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకూ ఉదయం 9 దాటిన తర్వాత బయటకు వెళ్లకండి. అంతగా వెళ్లాల్సివస్తే గొడుగు  తప్పకుండా తీసుకెళ్లండి. తరచూ లిక్విడ్స్ తీసుకోండి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బతో మంచానపడటం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: