ఏపీలో అందరి దృష్టినీ ఆకర్షించిన అసెంబ్లీ స్థానాలు మంగళగిరి, గాజువాక, భీమవరం. చంద్రబాబు కుమారుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ పోటీ చేయడమే ఇందుకు కారణం. అందులోనూ లోకేశ్ ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 


కానీ మంగళగిరిలో లోకేశ్ విజయం దాదాపు అసాధ్యం అని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన విశ్లేషకులు చెబుతున్నారు. ఏకంగా తెలుగుదేశం నేతలే లోకేశ్ ఓడిపోతారంటూ బెట్టింగులు కాస్తున్నారట. మరి అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది. లోకేశ్‌ ఓడిపోతే అందుకు కారణాలేంటి..? 

రాజధాని ప్రాంతంలో భూములపై వైసీపీ పోరాటం చేసినందున రైతుల మద్దతు  ఆ పార్టీకే ఉన్నట్టు తెలుస్తోంది. తాడేపల్లి పరిధిలోని భూములను గ్రీన్‌ బెల్ట్‌ నుంచి తొలగించి, వాటిని అమ్ముకునే సదుపాయం కల్పిస్తామన్న వైసీపీ ఇచ్చిన కీలక హామీ పని చేసిందట. తెలుగుదేశం వస్తే ఇక్కడి ప్రభుత్వ భూములను ఐటీ కంపెనీలకు ఇస్తుందనే భయం కూడా మరో కారణమట. 

వీటికితోడు వైసీపీ అభ్యర్థి ప్రారంభించిన రాజన్న రైతు బజార్‌,  రాజన్న క్యాంటీన్‌ వంటి కార్యక్రమాలు  స్థానికుల అభిమానం చూరగొన్నాయి. ఆయన ఎన్నికల దృష్టితో కాకుండా కొన్నేళ్ల నుంచి ఈ పనులు చేస్తున్నారు. ఇవన్నీ ఆయనకు ఓట్లు కురిపించాయట. దీనికితోడు లోకేశ్ ప్రసంగాలు, ఆయనపై  సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ కూడా మరో కారణం కావచ్చు. ఏదేమైనా వచ్చేనెల 23న కానీ అసలు మంగళగిరి విజేత ఎవరో తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: