ఏపీ ఎన్నికల్లో టీడీపీ- వైసీపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. మరి ఒకవేళ ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఏమవుతుంది. ఆయన అధికారం నిలబెట్టుకుంటే జరిగే పరిణామాలు ఏంటి.. చూద్దాం..


అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుంటారు. తెలంగాణలో పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ను ఇరుకున పెట్టే అవకాశాలు పరిశీలిస్తారు. కేంద్రంలో కాంగ్రెస్‌తో కలసి చక్రం తిప్పే ఛాన్సు కోసం ప్రయత్నిస్తారు. 

ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొన్ని స్కీములను ఎత్తివేసే ప్రమాదం కూడా ఉంది. అయితే తన ఎల్లోమీడియా ద్వారా ముందుగానే వాటిని జనం ప్రిపేరయ్యేలా ప్రచారం కల్పించొచ్చు.చ కేంద్రంలో మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. మోడీ నిధులు ఇవ్వడం లేదనే సాకు ఈ పథకాల ఎత్తివేతకు వాడతారు.

ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. పోలవరం కోసం వేల కోట్ల రూపాయలు మంజారు చేసుకునే అవకాశాలను ప్రయత్నిస్తారు. క్రమంగా పార్టీ, ప్రభుత్వ పగ్గాలు పూర్తిగా లోకేశ్ కు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటారు. తాను కేంద్రంలో బిజీ కాబట్టి లోకేశ్ చేతికి పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: