దెయ్యాలు ఉన్నాయా, అంటే ఉన్నాయి అన్న సమాధానం చెప్పేవారు ఉన్నారు. దేవుడు ఉన్నపుడు దెయ్యం ఎందుకు ఉండదని వాదించేవారు కూడా ఉన్నారు. మంచి ఉంటే చెడు ఉంటుందని, అలా దెయ్యం తప్పకుండా ఉండి తీరుతుందని చెబుతుంటారు.  అయితే దేముడిని చూసిన వారు లేరు, దెయ్యాన్ని చూసిన వారు అంతకంటే లేరు. కానీ దేముడు, దెయ్యం   ఈ రెండూ యుగాలుగా నలుగుతూనే ఉన్నాయి.


విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా పలాసా మండలం టెక్కలి గ్రామంలో జనం ఇపుడు దెయ్యం భ‌యంతో హడలిపోతున్నారుట. ఇక్కడ అర్ధరాత్రి 11 నుంచి 2 గంటల ప్రాంతంలో దెయ్యం తిరుగుతోందని జనం గట్టిగా నమ్ముతున్నారు. తెల్లని పొగ మనిషి రూపంలో అటూ ఇటూ తిరుగుతూ ఈ దెయ్యం ప్రజలను వణికించేస్తోందట. దెయ్యం అంటూ బిక్కచచ్చిపోతున్నారట జనం. రాత్రి ఏడు దాటితే బయటకు వచ్చేందుకు కూడా ససేమిరా అంటున్నారుట.


ఈ తెల్లని పొగ రూపాన్ని దెయ్యంగా భావించి  కొంతమంది స్థానికులు వెంబడిస్తే వారిపైన అపై ఇసుక, మట్టి బెడ్డలను ఆ దెయ్యం విసురుతోందని కూడా చెబుతున్నారు. మరి అది దెయ్యమా. దెయ్యం రూపంలో ఎవరైనా అలా చేస్తున్నారా. లేక ఆకతాయిల పనిగా ఇది చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి  ఆ గ్రామానికి చుట్టాలు కూడా వెళ్ళడం మానుకున్నారట. అక్కడ వారు సైతం ఇతర గ్రామాలకు వెళ్ళిపోతున్నారుట. ఈ దెయ్యం కధ ఏంటో పోలీసులే విప్పి చెప్పాల్సివుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: