``అందమైన అమ్మాయిలతో వాట్సాప్ చా టింగ్ కావాలా బాబు...మీరు వాట్సాప్ వీడియోలో అమ్మాయితో మరింత వెకిలిగా మాట్లాడాలనుకుంటున్నారా...నగ్నంగా పలకరింపులు కావాలనుకుంటున్నారా...మా ద‌గ్గ‌ర ఆ వీలుంది. అయితే దీనికి ప్రత్యేక ధరలున్నాయి.`` ఇది న‌యా దోపిడి. చాటింగ్‌తో మొదలు పెట్టి యువతితో అభ్యంతకరమైన రీతిలో మాట్లాడే వరకు లాగి... నిమిషానికో ధర అంటూ రూ. వెయ్యి నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్న కొత్త ముఠా హైద‌రాబాద్ స‌హా ప‌రిస‌ర ప్రాంత యువ‌త జీవితాల‌ను గుల్ల చేస్తోంది. 
గ‌తంలో వ్యభిచార దందాలో ఉన్న నిర్వాహకులు రూటు మార్చి ఈ వాట్సాప్ దందాను నిర్వహిస్తున్నారు. నగ్న దృశ్యాల వీడియోలు వాట్సాప్‌లో పెట్టి ఆకట్టుకుంటున్నారు. ఇందుకు కొన్ని ముఠాలు వాట్సాప్ వీడియో కాల్స్ వేదికగా నయా దందాను ప్రారంభించాయి. అమ్మాయిలతో చాటింగ్, వాట్సాప్, నగ్న దృశ్యాలతో పలకరించి... యువతకు ఎర వేస్తున్నారు. ఈ దందా చాపకింద నీరులా విస్తరించడంతో చాలా మంది యువకులు వీరి బారిన పడి వేలాది రూపాయలను పో గొట్టుకుంటున్నారు. అంతేకాకుండా వ్యసన బానిసలుగా మారుతున్నారు. డబ్బుల కోసం చాలా మంది యువకు లు ఇంటి దొంగలుగా మారుతున్నారు.
వ్య‌భిచారం నిర్వ‌హింస్తే..దొరికిపోత‌మ‌ని భావించిన ముఠాలు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్ చాటింగ్‌లను ఎంచుకుంటున్నారు. వాట్సాప్‌లో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ  దా నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ చాటింగ్‌ల కోసం ప్రత్యేకంగా ముఠాలు అమ్మాయిలను ఆంధ్రప్రదేశ్, తె లంగాణలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో అడ్డాలను పెట్టుకుని ఈ వర్చ్యూవెల్ సెక్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాలో పోలీసులకు దొరికే ఛాన్స్ లేదని... ఒక వేళ దొరికినా ఆ వీడియోలన్నింటినీ డిలీట్ చేస్తే పోలీసులకు దొరకమని వారు భావిస్తున్నారు. దీంతో ఈ దందాను ఇప్పుడు జోరుగా నిర్వహిస్తూ యువతను కామమత్తులోకి దించి... వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.  
తల్లిదండ్రులు, ఇంట్లోని కుటుంబ సభ్యులు త‌మ పిల్ల‌ల ప‌ట్ల‌ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలను కంటకనిపెడుతూ వారి స్మార్ట్ ఫోన్‌లను తనిఖీ చేయాలి. ఒంటరిగా గదుల్లో ఉండి ఫోన్‌లు మాట్లాడుతున్నప్పుడు వారిని గమనించాలి. ఎవరితో మాట్లాడుతున్నారని ప్రశ్నించాలి. వేలాది రూపాయల డబ్బులు అడుగుతున్నప్పుడు అనుమానించాలి. వారి ఫోన్‌ల నుంచి ఆన్‌లైన్ ఖాతాల గురించి తెలుసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: