తన పిల్ల‌ల కోసం ఆ త‌ల్లి ప‌డుతున్న పోరాటం స‌గం ఫ‌లించింది. అత్తింటి వేధింపులు భ‌రించ‌లేక మీడియా ముందుకొచ్చిన సింధూ శ‌ర్మ పోరాటం కొన‌సాగుతోంది. ఇద్ద‌రు ప‌ల్ల‌ల్ని అప్ప‌గించాలంటున్న ఆమెకు మ‌హిళా సంఘాలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో సింధూ శ‌ర్మ అత్తింటి ముందు ద‌ర్నా చేప‌ట్టింది. దీంతో అత్తింటివారు దిగొచ్చారు. ఇద్ద‌రు పిల్ల‌ల్లో చిన్న‌పాప‌ను అప్ప‌గించారు. త‌న ప‌ద‌వీ కాలంలో ఎన్నో కేసుల‌కు న్యాయం చెప్పిన మాజీ జ‌డ్జ్ నూతి రామ్మోహ‌న్ రావు త‌న కోడ‌లికి మాత్రం తీర‌ని అన్యాయం చేస్తున్నాడంటూ మ‌హిళా సంఘా మండిప‌డుతున్నాయి.


క‌ట్నం తీసుకోవ‌డం చ‌ట్ట‌రిత్యా నేర‌మ‌ని స‌మాజానికి చెప్పాల్సిన ఆయ‌నే. .అదే క‌ట్నం కోసం కోడ‌లినే చిత్ర హింస‌ల‌కు గురిచేస్తున్నార‌ని ఆరోపించాయి.  హైకోర్టు రిటైర్డ్ జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న్‌రావుపై ఆయ‌న కోడ‌లు సింధూ శ‌ర్మ సీసీఎస్ పోలీసుల‌కు పిర్యాదు చేశారు. అద‌న‌పు క‌ట్నం కోసం త‌న భ‌ర్త వ‌శిష్ఠ‌, మామ రామ్మోహ‌న్ రావు, అత్త చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని చెప్పారు. అంతే కాదు త‌న‌పై దాడి చేశార‌ని సింధూ కొన్ని ఫోటోల‌ను కూడా బ‌య‌ట‌కు విడుద‌ల చేశారు. అయితే ఆమె చేతికి, మెడ మీద కొట్టిన గాయాలు మాత్రం స్ప‌ష్టం క‌నిపిస్తున్నాయి.


భ‌ర్త వ‌శిష్ఠ తో పాటు అత్త‌మామ‌లు కూడా దాడి చేశారంటూ సాక్షాలు చూపించారు. అయితే ఇప్ప‌టికే రిటైర్డ్ జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న్ రావు, అతని భార్య‌త తో పాటు సింధూ భ‌ర్త వ‌శిష్ఠ‌పై సీసీఎస్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 498 ఏ, 406, 323 సెక్ష‌న్ల తో పాటు, డీపీ యాక్ట్ 4, 6 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. కాగా, సింధూ వ‌శిష్ఠ‌ల‌కు ఏడేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. రెండేళ్ల క్రితం నుంచి ఇద్ద‌రి మ‌ధ్య వివాదం న‌డుస్తుంది. దీంతో సింధూ పుట్టింటికి వ‌చ్చేసింది. అయితే వ‌శిష్ఠ‌తో పాటు త‌న మామ నూతి రామ్మోహ‌న్‌రావు, అత్త వ‌చ్చిపుట్టింట్లోనే త‌న‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సింధూ. 

మరింత సమాచారం తెలుసుకోండి: