కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వేణు చౌదరి తెలుగుదేశం ఎన్నారై విభాగానికి చెందిన వ్యక్తి. అయితే ఏంటి ప్రత్యేకత అంటారా.. ఈయన గత ఎన్నికల్లోనూ సర్వే చేయించి ఫలితం చెప్పాడు. ఆ ఫలితం దాదాపుగా కరెక్టుగా వచ్చింది.


ఈసారి కూడా ఆయన సర్వే చేయించారు. ఆ సర్వే ఫలితాల్లో ఈ ఎన్నికల్లో వైసీపీ కంఫర్ట్‌బుల్ మెజారిటీ సంపాదిస్తుందని తేలిందట. వైసీపీకి కనీసం 105 సీట్లు కచ్చితంగా వస్తాయట. టీడీపీ 60 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇక జనసేన మూడు వరకూ వచ్చే అవకాశం ఉందట. 

ఐతే...ఈయన నందిగామకు చెందిన వ్యక్తి కావడంతో ఆ ఎమ్మెల్యే సీటుపై ప్రత్యేక శ్రద్దతో సర్వే చేయించారట. ఈయన సర్వేలో నందిగామ కూడా వైసీపీ గెలవబోతోందట. ఆయన లెక్క ప్రకారం 8000 మెజారిటీ వస్తుందట. ఈ లెక్క పదివేల వరకూ కూడా వెళ్లవచ్చట. 

రాష్ట్రంలో వైఎస్ జగన్ ట్రెండ్ ఉండటం వల్ల ఈ ఫలితాలు వస్తాయని ఆయన అంటున్నారు. మరి టీడీపీకి చెందిన వ్యక్తి ఇలా చెప్పడం టీడీపీ వర్గాలకు కూడా మింగుడుపడటం లేదు. మరి తెలుగుదేశం కంచుకోటలాంటి నందిగామ సీటు వైసీపీకి వెళ్లడం అంటే గొప్ప విషయమే. 


మరింత సమాచారం తెలుసుకోండి: