టీయారెస్ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ జాతీయ రాజకీయాలపై  ఇపుడు ద్రుష్టి పెట్టారు. ఆయన హస్తినలో తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణా సీఎం గా రెండవ మారు రికార్డ్ మెజారిటీతో నెగ్గిన కేసీయార్ దేశంలో సరిసాటి తనకు ఎవరు అంటున్నారు.


నిన్నటివరకూ కేసీయార్ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తారన్న మాట వినిపించింది. అయితే మారిన రాజకీయ పరిణామాల క్రమంలో డిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ ని ముందు పెట్టి దేశాన్ని ఏలాలన్న కాంక్ష కేసీయార్ లో ఎక్కువైపోతోందట. కేసీయార్ ఆలోచనల మేరకు ఢిల్లీలో ఏ పార్టీకి మెజారిటీ రాదని, అపుడు వంద సీట్లతో అన్ని పార్టీలను కలుపుకుని ఫెడరల్ ఫ్రంట్ ముందుకు వస్తే దానికి కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల మద్దతు తీసుకుని ఏకంగా ప్రధాని పదవినే పట్టేద్దామని కేసీయార్ పావులు కదుపుతున్నారట.


తనకు వచ్చిన ఎంపీలకు తోడు, వైసీపీ, బిజూ జనతాదళ్ ను కలుపుకుంటే యాభైకి తక్కువ లేకుండా వస్తారు కాబట్టి, మమత, మాయావతి వంటి వారు తన వెనకే ఉంటారని కేసీయార్ అంచనా వేస్తున్నారుట. అంటే ఓ విధంగా 1996 నాటి ప్రయోగానికి కేసీయార్ రెడీ అవుతున్నారు. మరి ఆ జాక్ పాట్ కేసీయార్ కి తగులుతుందా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: