సినీ నటుడు శివాజీ.. ఈయన సినిమాల్లో అంతగా ఛాన్సుల్లేక ఏపీ రాజకీయాల్లో స్థానం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. కొన్నాళ్లు బీజేపీలో చేరారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఓ ఉద్యమం లేవదీశారు. 


పాపం దానికీ అంత స్పందన లేదు. ఇప్పుడు శివాజీ ఏ పార్టీయో తెలియదు. ఏ సంస్థో తెలియదు. అయితే అలాంటి శివాజీకి నెంబర్ వన్ ఛానల్ టీవీ9లో మాత్రం విపరీతమైన కవరేజ్ ఇచ్చేవారు. ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా లైవ్‌ ఇచ్చేవారు. 

ఆయన ధర్నాలు, లైవ్‌లో ప్రత్యేక మైన డిబేట్లు శివాజీకి ఇచ్చేవారు. మరి ఈ శివాజీకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేది కాదు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఈ శివాజీ టీవీ9 వ్యవస్థాపకుల్లో ఒకరైన రవిప్రకాశ్‌ కు స్నేహితుడు. 

అంతే కాదు.. ఇటీవల ఇంకో విషయం బయటపడింది. రవి ప్రకాశ్‌ కు చెందిన టీవీ9 షేర్లలో కొన్ని నటుడు శివాజీ కొన్నాడట. అంటే టీవీ9 ఓనర్ల జాబితాలో శివాజీ కూడా ఉన్నాడన్నమాట. అందుకే శివాజీకి అంత కవరేజ్ దక్కిందన్నమాట. అదీ అసలు సంగతి.



మరింత సమాచారం తెలుసుకోండి: