ఆయన వైసీపీలో చేరడం లేదట.. ముందు ముందు చేరే ఉద్దేశ్యం కూడా  లేదట. ఈ మాటలు చెబుతున్నది ఎవరో రాజకీయ నాయకుడు కాదు.. ఓ సినిమా డైరెక్టర్.. డైరెక్టర్‌కు పాలిటిక్స్ ఏంటనుకుంటున్నారా.. ఆయనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 


మొన్న విజయవాడలో ఆయన ప్రెస్ మీట్‌ ను పోలీసులు అడ్డుకున్న ఘటనపై తర్వాత వైసీపీ అధ్యక్షడు జగన్ స్పందించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా. అని ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ ఏం తప్పు చేశారని నిలదీశారు. ఏకంగా జగన్ స్పందించడంతో అందరి దష్టీ ఆర్జీవీ పాలిటిక్స్ పై మళ్లింది. 



ఇంకేముందు రామ్ గోపాల్ వర్మ కూడా వైసీపీలో చేరుతున్నారేమో అనుకున్నారు. దీనిపై వర్మ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చాడు. తనకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరే ఉద్దేశం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.సినిమా పై జగన్‌గారు వైసీపీ పార్టీ మెంబర్‌గా కాదు ఓ నార్మల్‌ వ్యక్తిగా రియాక్ట్‌ అయ్యారన్నాకుయ 

వైసీపీలో చేరే ఉద్దేశమే నాకు లేదు. మీ అందరి మీద ఒట్టు అన్నారు వర్మ. నిర్మాత రాకేశ్‌ రెడ్డి మాట్లాడుతూ –ప్రెస్‌మీటే కాదు మీరు కూడా విజయవాడలో ఉండకూడదు అన్నారు. ఈ సినిమా రిలీజ్‌పై అక్కడున్న ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి. అయినా మీ నిజం బయటపడుతుందనా? ప్రెస్‌మీట్‌ సవ్యంగా జరిగుంటే వాళ్లకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిందని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: