అదేదో సినిమాలో కర్ణ పాత్రధారిగా అన్న గారు అంటారు. ఇక మంచి లేదు. మానవత్వం లేదు అని. నిజానికి రాజకీయాల్లో మంచి ఎక్కడుంది. మనకు జరిగిపోతే అంతా మంచి. తేడా కొడితే మాత్రం పెడ బొబ్బలు పెడతారు. మోడీ విషయంలోనూ ఇటు రాజకీయ జనం ఇంతవరకూ ఒక వైపే చూసారు. రెండవ వైపు చూడాలనుకోకున్నా మోడీ ఏంటో చూపించేస్తారా..


2019 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా బీజేపీ రావడం ఖాయం. ఇక చిన్నా చితకా పార్టీల మద్దతు మోడీకి ఈసారి అవసరం పడుతుంది. మరి మోడీ వారిని ఒప్పించి మద్దతు తీసుకుంటారా లేక చంద్రబాబు తదితరులు ముందే మొదలెట్టేసిన ఫిరాయింపుల బాట పడతారా అన్నది ఓ చర్చగా ఉంది.


అయితే మోడీ ఎటువంటి డౌట్లూ పెట్టుకోనవసరం లేకుండా తన మనసులోని మాటను బయటకు  చెప్పేశారు. పశ్చిమ‌ బెంగాల్లో ఓ సభలో ఆయన మాట్లడిన  మాటలు ఇపుడు రాజకీయాల్లో పెద్ద చర్చనే రేపుతున్నాయి. నాతో 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ మోడీ చేసిన ప్రకటన చాలామంది గుండెల్లో రైళ్ళు  పరిగెట్టిస్తోందిట. ముఖ్యంగా చంద్రబాబు ఈ ప్రకటన వెనక అసలు కధను బాగానే చదివేశారు. 


రేపటి రోజున మోడీ మళ్ళీ పవర్లోకి రావడానికి అన్ని పార్టీలను విడివిడిగా కలివిడిగా చీల్చేస్తారు. అందులో మొదటి దెబ్బ టీడీపీ మీదనే పడనుందని అంటున్నారు. ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా టీడీపీ ఎంపీలను మోడీ లాగేస్తారన భయం ఇపుడు బాబును పట్టి పీడిస్తోందట. చూడాలి  మరి, మ‌రెన్ని పార్టీలకు మోడీ కంగారు పుట్టిస్తున్నారో.



మరింత సమాచారం తెలుసుకోండి: