ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే ఎన్నో సర్వేలు వచ్చాయి. అయితే వీటిలో నిపుణులైన సెఫాలజిస్టులు చేసిన సర్వేలు చాలా తక్కువ. కానీ.. సికింద్రాబాద్ కు చెందిన  సెఫాలజిస్టు వేణుగోపాల్ రావు తన ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్‌ తాజా సర్వే వివరాలు ప్రకటించారు. 


ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ లో జగన్ సునామీ ఖాయంగా కనిపిస్తోంది. ఏదో అలా ఇలా బొటాబొటీ మెజారిటీతో కాకుండా.. సునామీ తరహాలో జగన్ విజయం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 

సీపీఎస్ సర్వే ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  దాదాపు 124 స్థానాలు వరకూ గెలుచుకుంటుందని తెలుస్తోంది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ 42 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. జనసేన పార్టీ రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. 

మరో 9 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉందని.. ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమని తేల్చారు. ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే.. 47.6 శాతం ఓట్లు సాధించిన వైసీపీ మొదటి స్థానం దక్కించుకుంటుంది. టీడీపీ 39.1 శాతం ఓట్లు తెచ్చుకుంటుంది. జనసేన పార్టీ 8.2 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: