మంగళగిరిలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఓడిపోతారా.. గెలుస్తారా.. ఒకవేళ ఆయన ఓడిపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. అనేక సర్వేల్లో మంగళగిరిలో లోకేశ్ ఓడిపోతున్నారని చెబుతున్నాయి. వాస్తవానికి టీడీపీకి మంగళగిరి అంత సేఫ్ సీటు కాదు. 


అయితే రాజధాని ప్రాంతం కావడం.. భూములు రేట్లు విపరీతంగా పెరగడం, ఐటీ కంపెనీలు కొన్ని రావడం వంటి అంశాలు టీడీపీకి బాగా కలసివస్తాయని ఊహించి లోకేశ్‌ ను అక్కడి నుంచి బరిలో దింపారు. కానీ ఈ వ్యూహం వర్కవుట్ అయినట్లు అనిపించడం లేదని ఆ పార్టీ నేతలే తమ సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. 

ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి... నారా లోకేశ్ కూడా  ఓడితే.. ఏంటి పరిస్థితి.. ఓవైపు చంద్రబాబు వయోభారంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు పార్టీని లోకేశ్ చేతుల్లో పెడదామా అని చూస్తున్నారు. మరి లోకేశ్ ఫస్‌ ఎన్నికల్లోనే ఓడితే పార్టీలోని ఇతర నాయకులు ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తారా..

ప్రస్తుతానికి తెలుగుదేశంలో చంద్రబాబు చెప్పిందే వేదం.. కానీ ఎన్నికల్లో ఓడిపోతే.. అందులోనూ లోకేశ్ కూడా ఓడితే.. అప్పుడు కూడా సీన్ ఇలాగే ఉంటుందా.. లేక.. బలమైన నేతలు గళం విప్పి తిరుగుబాటు చేస్తారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. మళ్లీ నందమూరి కుటుంబానికి పార్టీని అప్పగించాలన్న వాదన కూడా రావచ్చు. చూడాలి ఏంజరుగుతుందో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: