ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత నేతలు అంచనాల్లో మునిగారు. ప్రధాన నేతలు కుటుంబాలతో పాటు కాస్త ఆటవిడుపుగా విహార యాత్రలకూ వెళ్లారు. మరికొందరు గతంలో చేయాలని కుదరని పరామర్శలు చేస్తున్నారు. 


ఐతే.. ఇటీవల జగన్ పార్టీనేతలో కలసి ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ వంటి కార్యక్రమమంలో కనిపించిన తీరు ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఉండే జగన్.. ఆ వీడియోలో మాత్రం ఓ సినిమా హీరో తరహాలో కనిపించారు. అందమైన హెయిర్‌ స్టయిల్.. పొట్టి చేతుల చొక్కాతో పాటు కాస్త మేకప్ కూడా వేశారా అన్నట్టు కనిపించారు. 

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీ నాయకులతో పాటు కాస్త కబుర్లు చెబుతూ టీ తాగుతున్న ఈ వీడియోలో జగన్ తో పాటు విజయవాడ వైసీపీ నాయకులు కనిపిస్తున్నారు. 

ఓ పైవ్ స్టార్ హోటల్లో ఈ మీటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. లిఫ్టులో వెళ్తూ కూడా జగన్ ఫ్యాన్స్ కు చేతులు ఊపారు. మీరూ ఈ వీడియో చూసి.. మీ అభిప్రాయం చెప్పండి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: