ఎన్నికల తర్వాత టీడీపీ నేతల్లో జోష్ తగ్గిందా? ముఖ్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలే వారిలో నైరాశ్యాన్ని నింపాయా? అంటే "ఔను" అనే చెబుతున్నారు పార్టీ నేతలు. అసలు మేమేందుకు ఓడిపోతాం? మాకు 110 నుంచి 130-140-150 సీట్లు వస్తాయని అందరూ పదే పదే చెబుతున్నారని నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే వ్యాఖ్యానించారు.

Image result for chandrababu lost his integrity every where after elections

ఎన్నికల రోజు ఉదయం పది గంటల నుండే ఆయన పెడుతున్న గగ్గోలు చూస్తుంటే ఓటమి ఖాయం అని స్పష్టం అవటం -  కేవలం ఈ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకే ఆయన రంగం సిద్ధం చేసుకుని దేశ వ్యాప్త పర్యటనలలో మునిగిపోయారని అనుమానం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ప్రతి చోటా ఈవిఎంలపై, నరేంద్ర మోడీపై వ్యతిరేఖ ప్రచారం చేసుకుంటూ తనలో చెలరేగుతున్న ఉద్రిక్తత తగ్గించుకోవటానికి చేసే ప్రయత్నమే ఇదని అంటున్నారు. 

Image result for chandrababu lost his integrity every where after elections

ఎన్నికలు అయిన తరవాత “ఢిల్లీ వెళ్ళి పోరాటం” అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సాక్ష్యాత్తూ ఒక టిడిపి ప్రభుత్వంలోని ఒక మంత్రే తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఉంటే ముందే చేసుకోవాలి కానీ, ‘ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి చేసేది ఏముంది?' అని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.


చాలా మంది మంత్రులకు ఫలితాల విషయంలో  ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అందుకే బెట్టింగ్ ల విషయంలో కూడా ఒక వైపు వైసీపీ నేతలు ఫుల్-జోష్ లో పందాలు కాస్తుండగా, టీడీపీ నేతలు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. పైగా తమ సన్నిహితులకు పరిస్థితి అనుకూలంగా లేదని, తొందరపడి పందాలు కాసి డబ్బు పోగొట్టుకో వద్దని సూచిస్తున్నారు.

Image result for chandrababu lost his integrity every where after elections

ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభం అయిన రెండు గంటల తర్వాత నుంచి బాబు ఈవిఎం ల పనితీరుపై గగ్గోలు మొదలు పెట్టి గందరగోళం సృష్టించారు.  “రాష్ట్రం లోని కోట్లాది ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా తమ ఓటు వేసిన దానికి కాకుండా వేరే పార్టీకి వెళ్ళిందని ఫిర్యాదు చేయలేదు”

Image result for chandrababu lost his integrity every where after elections

సాక్ష్యత్తూ టీడీపీ అధినేత, దేశంలోనే అత్యంత అధిక రాజకీయ అనుభవం ఉన్న నేత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తన ఓటు ఎవరికి పడిందో? తెలియదని వ్యాఖ్యానించటం ద్వారా ఒక ప్రక్క పెద్ద దుమారమే రేపి సర్వజనీనంలో తన ప్రతిష్టతోపాటు నమ్మకం పెద్దరికం నిష్కాపట్యం కోల్పోయారు. 

Image result for chandrababu lost his integrity every where after elections

అప్పుడే టీడీపీ నేతలకు అనుమానం మొదలైంది. ఏకంగా పార్టీ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో నాయకుల్లో  ‘గెలుపు’ పై విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ మానసిక ఉద్రిక్తతకు మే 23న పూర్తి క్లారిటీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే ఛంద్ర బాబు ప్రవర్తన, మాతలు టిడిపి నేతల రాజకీయ ఉపన్యాసాల విన్యాసాల ద్వారా, ఎలెచ్తిఒన్ కమీషన్ పై చేస్తున్న వ్యాఖ్యల ద్వారా చాలా మందికి స్పష్టత వచ్చింది. ఇక స్పష్టత రావాల్సింది మాత్రం అసలు ఆ పార్టీ అధినేతకే. 

 Image result for chandrababu lost his integrity every where after elections

మరింత సమాచారం తెలుసుకోండి: