కాబోయే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇది ఇప్పుడు ఏపీలో బాగా వినిపిస్తున్నమాట. మరి వైసీపీ ఏమేరకు ఎన్నికల్లో విజయం సాధిస్తుందో కానీ.. బయట టాక్ మాత్రం భయంకరంగా ఉంది. సర్వేలు, జనం, బెట్టింగులు.. ఇలా ఏది చూసిన జగన్ జపమే చేస్తున్నారు. 


కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఓ ముఖ్యనేతకు జగన్ గెలుపుపై  అనుమానం ఉందట. అందుకే ఆయన నోరు మెదపడం లేదట. ఇంతకీ ఆ ముఖ్యనేత ఎవరో తెలుసా.. ఆయనే కేసీఆర్. అవును. ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏపీ ఫలితాల అంచనాపై ఎక్కడా కామెంట‌ చేయనేలేదు. ప్రచారం సమయంలో కూడా ఒకే ఒక్కసారి స్పందించారు. 

ఇప్పుడు ఇదే టీడీపీ నేతల్లో ఆశలు రేపుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ మౌనంగా ఉన్నారంటే..దాని అర్థం టీడీపీ గెలుస్తుందని తేలడమే అంటున్నారు ఏపీ  మంత్రి అయ్యన్నపాత్రుడు. ఎన్నికల ముందు నుంచి సీఎం చంద్రబాబును, టీడీపీ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి ఆంధ్రులను కించపరుస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారని ఆయన అంటున్నారు. 

ఆంధ్రాలో పోలింగ్‌ సరళిని గమనించిన తండ్రీకొడుకులిద్దరూ నోరెత్తడం లేదని అయ్యన్న చెప్పుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ నివేదిక చూసిన తర్వాత కేసీఆర్‌కు నోట మాటరావడం లేదని అయ్యన్న ఎద్దేవా చేస్తున్నారు. ఐతే.. కేసీఆర్ నోరెత్తనిమాట నిజమే అయినా.. కేటీఆర్ మాత్రం చంద్రబాబు ఓడిపోతున్నాడని పలుమార్లు చెప్పారు. ఏదేమైనా మే 23న కానీ అసలు విషయం తేలదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: