తెలుగుదేశం నేతలకు బ్యాడ్ టైమ్ ప్రారంభమైనట్టుంది. ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారులు ఎవరూ వారిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల పోలింగ్ తర్వాత దాదాపు నలభై రోజులు గ్యాప్ రావడం ఇదే మొదటి సారి. దాంతో ఎన్నికల కోడ్ విషయం ఏం చేయాలో అటు అధికారులకు,ఇటు మంత్రులకు తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 


తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈ విషయంలో ఘోర అవమానం ఎదురైంది. వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి కొద్ది రోజుల క్రితమే తాను సమీక్ష సమావేశం నిర్వహిస్తానని అధికారులకు సమాచారం ఇచ్చారు. కొందరు కోడ్ గురించి చెప్పగా.. ఆ సమావేశానికి అధికారులు రాకపోతే.. పదవి నుంచి తప్పుకుంటానని ఘాటుగా కామెంట్ చేశారు. 

అంతే కాదు.. అవసరమైతే సుప్రింకోర్టుకు కూడా వెళతానని ప్రకటించారు. ఇంతలో సమీక్ష చేసే రోజు రానే వచ్చింది. మంత్రిగారు సమీక్ష కోసం వచ్చి కూర్చున్నారు. పాపం.. సమీక్షలకు అధికారులు అంతా వస్తే.. చివరలో మంత్రిగారు రావడం కామన్. కానీ మంగళవారం మంత్రిగారు వచ్చికూర్చున్నా.. అధికారులు అటువైపు తిరిగి చూడలేదు. 

పాపం సోమిరెడ్డి.. గంట.,. రెండు గంటలు.. మూడు గంటలు.. ఇలా దాదాపు మూడు గంటలసేపు నిరీక్షించి ఇక లాభం లేదనుకుని కోపంతో వెళ్లిపోయారు. ఇంతకీ అధికారులు ఎందుకు రాలేదంటే..  వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డి తదితరు ఈ సమీక్ష గురించి ఈసీని క్లారిటీ అడిగారట. కానీ ఈసీ ఏమీ తేల్చి చెప్పలేదట. 

ఈసీ చెప్పనప్పుడు ఎందుకొచ్చిన గొడవ అని అధికారులు దూరంగా ఉండిపోయారు. మొత్తానికి ఏపీలో మంత్రులకు ,అదికారులకు మద్య కోడ్ సమస్య వివాదంగా మారుతోంది. మరి ఇంతకీ ఇప్పుడు సోమిరెడ్డి ఏం చేస్తారో.. రాజీనామా చేస్తారా.. సుప్రీంకోర్టుకు వెళ్తారా.. లేదా ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు అనేసి సైలైంటైపోతారా.. చూడాలి ఏం జరుగుతుందో..? 



మరింత సమాచారం తెలుసుకోండి: