నంద్యాల ఎంపి ఎస్పీరెడ్డి మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన రెడ్డి జిల్లాలోనే బాగా సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రెడ్డి కొంతకాలంగా కిడ్నీ, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. గుండె పనితీరులో తీవ్ర సమస్యలు తలెత్తటంతో బుధవారం తెల్లవారి మరణించారు.

 

నందిపైపుల ఇండస్ట్రీ వ్యవస్ధాపకుడిగా రెడ్డికి మంచి గుర్తిపుంది. పారిశ్రామికవేత్తగా బాగా పాపులరైన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బాగా చురుగ్గా ఉండేవారు. 2004, 2009, 2014లో ఎంపిగా పనిచేశారు. మొదటిరెండు సార్లు కాంగ్రెస్ తరపున గెలిస్తే మూడోసారి వైసిపి ఎంపిగా గెలిచారు. అయితే వైసిపి తరపున గెలిచిన వారం రోజులకే రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు.

 

మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన రెడ్డి అనారోగ్యంతోనే ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తగానే కాకుండా రాజకీయాల్లో కూడా బాగా చురుగ్గా జరిగేది. ఒకరూపాయికే జొన్న రొట్టెను అందించి ఎందరో పేదల ఆకలి తీర్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: