మావోయిస్టు అంటేనే కరడుగట్టిన మనసుతో ఎదుటి వారిని చంపేంత కసితో ఉంటారని అంటారు.  వారి ఉద్యమాలు..ఆవేశాలు..ప్రత్యర్థులపై వారి కఠిన చర్యలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలిసిందే.   ఇక  ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ అడవుల్లో కరడుకట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీ అంటే మగవాళ్లకు సైతం వెన్నులో వణుకు పుట్టెలా చేస్తుంది. 


కొంత కాలంగా మావోయిస్టు నేతల్లో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు.  మల్కన్‌గిరీ ప్రాంత మావోయిస్టు కమిటీ సభ్యురాలై మంగ్లీపై రూ.5లక్షల రివార్డు ఉంది.  2011 నుంచి మావోయిస్టుల్లో పనిచేస్తున్న మంగ్లీ.. భద్రతా దళాలు, గ్రామస్థులపై దాడిచేసిన కేసులో నిందితురాలని ఎస్పీ పేర్కొన్నారు. మంగ్లీపై పది కేసులున్నట్టు చెప్పారు.


మలివాడలో మందుపాతర పేల్చివేత, 2016లో సీఆర్‌పీఎఫ్ బలగాలను చంపిన కేసు, చోలనర్‌లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో మంగ్లీ నిందితురాలిగా ఉన్నారు.  దంతెవాడ స్థానిక పోలీసులు, జిల్లా రిజర్వు గార్డులు కలిసి గాలింపు జరిపి మహిళా మావోయిస్టు మంగ్లీని అరెస్టు చేశారని ఎస్పీ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: