జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి తానే అని చాలా సార్లు చెప్పారు. తాను కచ్చితంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతారనే అంచనాలు ఎవరికీ లేవన్నది మాత్రం వాస్తవం. 


కాకపోతే.. అటు జగన్ అయినా.. ఇటు చంద్రబాబు అయినా సరే. ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం పవన్ కల్యాణ్ మాత్రమే. ఎందుకంటే.. ముక్కోణ పోటీలో పవన్ కల్యాణ్ పార్టీ చీల్చే ఓట్లే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ఎవరో డిసైడ్ చేయబోతున్నాయి. 

పవన్ కల్యాణ్ కు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకూ స్థిరమైన ఓటు బ్యాంకు ఏర్పడింది. అది పదివేలా.. 50వేలా అన్న విషయం పక్కకు పెడితే.. ఆయనకంటూ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకు ఎవరి నుంచి వచ్చింది. ఎవరి ఓట్లు చీల్చింది అన్నది ఇప్పుడు విజేతను డిసైడ్ చేయబోతోంది. 

ఈ సారి ట్రయాంగిల్ వార్‌లో ఫైటింగ్ చాలా టైట్ గా ఉండబోతోంది. చాలా చోట్ల మెజారిటీ పదివేలకు తక్కువే రావచ్చు. అలాంటి సమయంలో గెలుపును డిసైడ్ చేసేది పవన్ కల్యాణ్ జనసేన మాత్రమే. మరి జనసేనాని ఎవరి ఓట్లు చీలుస్తాడు.. ఎవరికి మేలు చేస్తాడన్నది అంతుబట్టని ప్రశ్న. ఏదేమైనా ఏపీకి సీఎం ఎవరు అవ్వాలి అన్నది మాత్రం పవన్ పైనే ఆధారపడి ఉందన్నది సత్యం. 



మరింత సమాచారం తెలుసుకోండి: