తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ ప్రమాదాల్లో ఎంతో మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. కొంత మంది తీవ్ర గాయాలపై అంగవైకల్యంతో బాధపడుతున్నారు..ఎంతో మంది అనాధలుగా మారుతున్నారు.  అయితే డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం ఈ అనర్థాలకు దారి తీస్తుందని రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని తీసుకున్నా వీరిలో మార్పు రావడం లేదని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. 


తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మైసిరెడ్డిపల్లి సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి సీఐ సురేందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని శ్రీ హిందు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులు ఓ వ్యవసాయ క్షేత్రంలో కళాశాల ఫేర్‌వెల్‌ పార్టీలో పాల్గొన్నారు.   


తిరిగి ఇళ్లకు వెళ్తుండగా మైసిరెడ్డిపల్లి శివారులో మలుపు వద్ద కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్పూర్తి(22), ప్రణీత(21), చైతన్య(23) అక్కడికక్కడే మృతి చెందారు.  ఇక మనీశ్‌ కుమార్‌రెడ్డి, వినోద్‌ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: