రోజులు గడిచేకొద్దీ చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. అంటే ఇది మే 23వ తేదీ కౌంటింగ్ టెన్షన్ కాదులేండి. కేసుల టెన్షన్.  ఇంత కాలం జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అండ్ కో జైలు పక్షి అని, ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవుతుంటారని చాలా ఎగతాళిగా మాట్లాడారు. అదే పరిస్ధితి తనకు కూడా తప్పదేమో అన్న టెన్షనే పెరిగిపోతోందట చంద్రబాబులో.

 

తన మీదున్న అక్రమాస్తుల కేసులన్నీ కేవలం రాజకీయంగా పెట్టినవే అంటూ జగన్ ఎంత మొత్తుకున్నా చంద్రబాబు అండ్ కో బురద చల్లుతునే ఉన్నారు. మరి ఇపుడు చంద్రబాబు కూడా కోర్టుల చుట్టూ తిరగటం మొదలుపెడితే ఆయనకు మద్దతిచ్చే మీడియా ఏమని కథనాలు వండి వారుస్తుంది.

 

జగన్ ఎదుర్కొంటున్న కేసుల్లో ఇంత వరకూ ఏ ఒక్క కేసు కూడా నిరూపణ కాలేదు.  మరి చంద్రబాబు పరిస్దితేంటి ? చంద్రబాబు మీద కూడా చాలా కేసులే కోర్టుల్లో స్టేల రూపంలో కోల్డు స్టోరేజీలో ఉన్నాయి. మరి అవన్నీ ఒక్కసారిగా జూలు విదుల్చుకుని విచారణకు వస్తే చంద్రబాబు పరిస్ధితేంటి ?

 

2005లో చంద్రబాబు మీద ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసును తాజాగా ఏసిబి కోర్టు విచారణ మొదలుపెట్టింది. దానికీ చంద్రబాబు అండ్ కో కిందా మీదా పడుతున్నారు. అదే సమయంలో ఓటుకునోటు కేసు కూడా విచారణ మొదలైతే చంద్రబాబు పరిస్ధితి ఇంకెలాగుంటుందో. ఎప్పటి నుండో స్టేలపై కంటిన్యు అవుతున్న ఇతర కేసులు వీటికి బోనస్ అనే అనుకోవాలి.

 

చంద్రబాబును చూస్తుంటే పాపం అనిపిస్తుంది. మే 23న అధికారం కోల్పోతే చంద్రబాబుకు  ఇబ్బందులు తప్పేట్లులేవు. అధికారం కోల్పోవటంతో పాటు కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగటం, ఏదైనా కేసులో అనూహ్య ఘటనలు ఎదురైతే ఇక చెప్పనే అక్కర్లేదు. రేపటి కౌంటింగ్ లో జగన్మోహన్ రెడ్డికే గెలుపు అవకాశాలున్నాయంటున్నారు. అదే సమయంలో కేంద్రంలో మళ్ళీ మోడికే అధికారమనే సంకేతాలు అందుతున్నాయి. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది. అందుకే ఏదేదో మాట్లాడేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: