భారత దేశంలో ఓ వైపు ఉగ్రవాదులు మరో వైపు మావోయిస్టులు ఎన్నో ఘాతుకాలకు పాల్పపడుతున్నారు.  ఇటీవల  పుల్వామా జిల్లాలో జవాన్ల కాన్వాయ్ లక్ష్యంగా శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. పేలుడు దాడికి 44 మంది అమరులయ్యారు.  జమ్ము నుంచి శ్రీనగర్ కు జవాన్ల కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దళానికి చెందిన ఉగ్రవాది కాన్వాయ్ లపై దూసుకు వెళ్లి బాంబ్ బ్లాస్ చేశాడు. 


తాజాగా ఇప్పుడు పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఓ పోలీస్‌ వాహనంపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 16 మంది పోలీసులు, డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. గడ్చిరోలిలో భద్రతాసిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 16 మంది భద్రతాసిబ్బంది మృతిచెంది నట్లు సమాచారం. 


అయితే బాంబ్ బ్లాస్ చేసిన తర్వాత మావోయిస్టులుఅక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే తేరుకున్న పోలీస్ ఫోర్స్ ఎదురు దాడి చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం అక్కడ భారీ స్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి.   దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉంటే.. మావోయిస్టులు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో  వాహనాలను దగ్ధం చేశారు. రహదారి నిర్మాణ పనులకు సంబందించిన 27 వాహనాలకు నక్సల్స్‌ నిప్పు పెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంగళవారం రాత్రి దాదాపు 150 మంది మావోలు ప్లాంట్‌లోకి చొరబడి.. 36 వాహనాలకు నిప్పుపెట్టారు. వీటిలో జెనరేటర్లు, పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకర్లు, రోడ్డు రోలర్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు ఘటనాస్థలంలో మావోయిస్టులు కరపత్రాలు వదిలివెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: