ఇదే విషయమై తెలుగుదేశంపార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు చేసిన పెద్ద తప్పు వల్ల మొత్తం నేతలందరూ మూల్యం చెల్లించుకోవాల్సి రావటమే చాలామందికి నచ్చలేదు.  ఎన్నికలకు ఏడాది ముందు బిజెపితో తెగతెంపులు చేసుకోవటమే చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పుగా టిడిపి నేతలు ఇపుడు తీరిగ్గా మదనపడుతున్నారు. బహుశా చంద్రబాబు కూడా ఇదే విషయమై తీరిగ్గా బాధపడుతున్నారేమో.

 

మామూలుగా తన వైఖరికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో బిజెపి చీ కొట్టినా, వద్దు పొమ్మన్నా కాళ్ళా వేళ్ళాపడి బిజెపితో పొత్తులు పెట్టుకున్నారు. ఎందుకంత ధీనంగా కాళ్ళా వేళ్ళా పడి పొత్తు పెట్టుకున్నారంటే బిజెపినే పవర్ లోకి వస్తుందని తెలిసిపోయింది కాబట్టి.  మరి నాలుగేళ్ళ పాటు కలిసి ఉన్న తర్వాత ఎందుకు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు ? అదే ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

2019 ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చంద్రబాబు అంచనా వేశారు. చంద్రబాబు వేసిన అంచనానే ఇపుడు తల్లక్రిందులవుతోంది. ఆ విషయం తెలిసిన దగ్గర నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. జరుగుతున్న ఎలక్షన్ చూస్తుంటే తన లెక్క తప్పుపోయిందని చంద్రబాబుకు అర్ధమైపోయింది. ఎన్డీఏ మెజారిటీ తగ్గటం వరకూ ఓకేనా కానీ యూపిఏ సంఖ్య అనుకున్నంతగా పెరగక పోవటమే సమస్యగా మారింది.

 

ఎన్డీఏలోనే గనుక చంద్రబాబు ఉండుంటే ప్రధాన శతృవు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అయ్యేవారు. అలాకాదని ఎన్డీఏతో తెగ తెంపులు చేసుకోవటం వల్ల ఒకేసారి సంబంధం లేని కెసియార్, అవసరం లేని నరేంద్రమోడితో పాటు జగన్ తో కూడా పోరాటం చేయాల్సొచ్చింది. కెసియార్, మోడిపై ఆరోపణలు, విమర్శలు చేయటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేకపోయిందని ఎన్నికల తర్వాత చంద్రబాబుకు అర్ధమైందని నేతలు చెప్పుకుంటున్నారు.

 

ఎన్డీఏలో నుండి బయటకు రాకుండా ఉండుంటే టిడిపినే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేదని పార్టీలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. చంద్రబాబు చేసిన తప్పు వల్ల అందరూ మూల్యం చెల్లించుకోవాల్సొస్తోందన్నదే నేతల బాధగా అందరికీ అర్ధమవుతోంది. రేపటి కౌంటింగ్ లో ఎంతమంది మూల్యం చెల్లించుకుంటారు అన్న విషయం స్పష్టమవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: