ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కరాష్ట్రాల్లో ‘ఫాని’ తుఫాన్ తో ఆందోళన పరిస్థితులు నెలకొంటున్నాయి..కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అంటూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చేతులు కట్టేస్తున్నారని ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఓవైపు ఫణి తుపాను ముంచుకొస్తుంటే, మరోవైపు తుపానుపై సమీక్షకు కూడా అవకాశం లేకుండా ఈసీ చేస్తోందని దుయ్యబట్టారు. 


ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై రేపట్నుంచి తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని... ఈసీని అడుక్కుని సమీక్షలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కోస్తాంధ్ర మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు.   


సీఎం చంద్రబాబు తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.   ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారని... ప్రధానికి ఉన్న వెసులుబాటు సీఎంలకు ఉండదా? అని అడిగారు. ఎన్నికల నియమావళి అందరికీ ఒకే విధంగా ఉండదా? అని ఎద్దేవా చేశారు.ఎన్నికల కోడ్ ను మోదీ ఎన్నిసార్లు ఉల్లంఘించినా నోటీసులు ఇవ్వరని మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: