తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తెలంగాణ మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  ఇరు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ బోర్డు చేసిన తప్పులకు విద్యార్థులు బలి అవుతున్నారని..ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విపక్షాలు మండి పడుతున్నాయి.  గత వారం రోజుల నుంచి ఇంటర్ బోర్డు వద్ద తల్లిదండ్రులు, విద్యార్థులు, పలు రాజకీయ పార్టీ నేతలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్  మాట్లాడుతూ..కేటీఆర్ కి ఆయన బావమరిది కి గ్లోబరినాతో సంబంధాలు ఉన్నాయని..లేదంటే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి ప్రమాణం చేయాలని ప్రజలు అప్పుడే నిజాన్ని నమ్ముతారని టీఆర్ఎస్..కేటీఆర్ కి సవాల్ విసిరారు.  ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగ్ర‌రూపం దాల్చారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలలో గ్లోబరినా ఐటీ సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను చెప్పినట్లు తెలిపారు.

పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు.``ఐటీ మంత్రిగా ఉంటె నాకే సంబంధమా? రూ.4 కోట్ల టెండర్ ఉంటే.. రూ.10 వేల కోట్ల స్కామ్ అంటూ ఒకాయన సోయి లేకుండా మాట్లాడుతున్నారు`` అని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పెద్దమ్మగుడికి రా అంటూ ఓ బఫున్ పిలుస్తున్నారంటూ వీహెచ్‌పై మండిపడ్డారు. ప్రతి పక్షాలు చిల్లర రాజకీయాలు చెయ్యొద్దు అని హెచ్చరించిన కేటీఆర్.

దాంత వీహెచ్, కేటీఆర్ పై మండి పడ్డారు.  కేసీఆర్‌కే రాజకీయ భిక్ష పెట్టానని, అలాంటి తనను బఫూన్ అంటావా? అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడే భాష మార్చుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని, అహంకారపు మాటలు వద్దని హితవు పలికారు. సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో తేలుతుందని వీహెచ్ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: